సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గచ్చిబౌలిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

21 గంటల క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : నగరంలోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బత్తుల మారెడ్డి (65), ఆయన భార్య భారతి (60), కుమారుడు నిశాంత్‌రెడ్డి (38) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ కె. సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కుటుంబం ఏడాది కాలంగా గౌలిదొడ్డిలోని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. ఆదివారం ఉదయం 8.40 గంటల సమయంలో ఫ్లాట్‌లో ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కుటుంబ సమస్యలు, అనారోగ్య కారణాలు ఈ ఘటనకు దారితీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆత్మహత్యలకు కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్