శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్‌ వినియోగదారులకు ట్రూడౌన్‌

4 గంటల క్రితం

erc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 10:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రూ.629 కోట్లు చెల్లించాలని ఎపిఇఆర్‌‌సి ఉత్తర్వులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజల నుంచి అధికంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి వారికి (ట్రూడౌన్‌)‌ చెల్లించాలని ఎపి విద్యుత్‌ ‌నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌‌సి) ఉత్తర్వులిచ్చింది. ఎఫ్‌‌పిపిసిఎ పేరుతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మూడు డిస్కంలు ప్రతినెలా 40 పైసల చొప్పున రూ.2,800.28 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఎస్‌‌పిడిసిఎల్‌ ‌పరిధిలో రూ.675.10 కోట్లు, సిపిడిసిఎల్‌ ‌పరిధిలో రూ.65.50 కోట్లు ట్రూఅప్‌ ‌కింద వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి ఉందని ఇటీవల డిస్కంలు.. కమిషన్‌ ‌ముందు పిటిషన్‌ ‌దాఖలు చేశాయి. అదేవిధంగా ఇపిడిసిఎల్‌ అదనంగా రూ.1,369.95 కోట్లు వసూలు చేసింది. ఇపిడిసిఎల్‌ ‌అధికంగా వసూలు చేసిన దాంట్లో ఎస్‌‌పిడిసిఎల్‌, ఇపిడిసిఎల్‌‌లకు సర్దుబాటు చేయగా, రూ.940.07 కోట్లు ట్రూడౌన్‌ ‌చేయాలని డిస్కంలు.. కమిషన్‌ ‌ముందు పిటిషన్‌ ‌దాఖలు చేశాయి. వీటిని పరిశీలించిన కమిషన్‌ ‌ఖర్చులు పోను రూ.629.35 కోట్లు వినియోగదారులకు ట్రూడౌన్‌ ‌కింద సర్దుబాటు చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ ట్రూడౌన్‌‌ను 2027-28 ఆర్థిక సంవత్సరం టారీఫ్‌‌లో సర్దుబాటు చేయాలని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్