ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: మతం మారినంత మాత్రాన కులవివక్ష అంతరించిపోదని, మతం ప్రాతిపదికన ఎస్‌సి రిజర్వేషన్ హక్కులను నిరాకరించడం రాజ్యాంగ సమానత్వం, సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. శతాబ్దాలుగా కులవివక్ష, అంటరానితనం, సామాజిక అణచివేతకు గురైన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మతం మారినప్పటికీ వివక్ష కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎస్‌సి హోదాకు సంబంధించిన మతపరమైన పరిమితులను పునఃపరిశీలించాలని కోరారు. కులవివక్షపై సమగ్ర అధ్యయనం చేపట్టి, రాజ్యాంగ సమానత్వానికి అనుగుణంగా అవసరమైన చట్టపరమైన మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుల మధ్య మతం పేరుతో విభజనలు సృష్టించే ప్రయత్నాలను ప్రతిఘటించి, వారి ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు.








కామెంట్‌లు (0)