శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

క్షణాల్లో గుండెజబ్బులను గుర్తించే ఎఐ స్కిన్‌ ప్యాచ్‌ ..!

12 జులై, 2026

AI skin patch that detects heart conditions in seconds...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 01:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సైటెక్ : హార్ట్‌ ఎటాక్‌ వంటి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని నిమిషాల ఆలస్యం కూడా ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా షికాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అత్యాధునిక ఎఐ స్కిన్‌ ప్యాచ్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్యాచ్‌ సెకనులోని వందోవంతు సమయంలోనే గుండె పనితీరును విశ్లేషించి, గుండె సంబంధిత సమస్యలను 99 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదని పరిశోధకులు తెలిపారు.

ఈ స్కిన్‌ ప్యాచ్‌ మృదువైన పలుచని పొరలా ఉండి, శరీరానికి సులభంగా అతుక్కుపోతుంది. ఇందులో అమర్చిన ఆర్గానిక్‌ ఎలక్ట్రోకెమికల్‌ ట్రాన్సిస్టర్లు గుండె కొట్టుకునే తీరులో వచ్చే స్వల్ప మార్పులను కూడా వెంటనే గుర్తించి, కృత్రిమ మేధస్సు (ఎఐ) సాయంతో అదే క్షణంలో విశ్లేషిస్తాయి. ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యులకు హెచ్చరికలు పంపించే సామర్థ్యం దీనికి ఉంది. సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లు గుండె స్పందన, నడక వంటి వివరాలను సేకరిస్తాయి. అయితే ఆ సమాచారాన్ని విశ్లేషించడానికి బయటి సర్వర్లపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త ఎఐ స్కిన్‌ ప్యాచ్‌ మాత్రం డేటాను పరికరంలోనే అత్యంత వేగంగా విశ్లేషించడం వల్ల స్పందన సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రాణాంతకమైన వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ వంటి గుండె స్పందనలో అకస్మాత్తుగా ఏర్పడే ప్రమాదకర మార్పులను ముందుగానే గుర్తించి, సకాలంలో వైద్య సహాయం అందేలా చేయడంలో ఈ పరికరం కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్