సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గోళ్ల రంగు వేసుకుంటున్నారా?

1 గంట క్రితం

nail
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గోళ్లు అందంగా కనిపించాలని చాలామంది మహిళలు నెయిల్ పాలిష్ వేసుకుంటారు. ఆకర్షణీయంగా కనిపించే ఈ గోళ్ల రంగు వేసుకోవడం వల్ల చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సౌందర్య సాధనాల్ని ఉపయోగించడం వల్ల గోళ్లు త్వరగా వాటి సహజశక్తిని కోల్పోతాయి. తరచూ వీటిని ఉపయోగించడం వల్ల గోళ్లు పలుచబడిపోవడం, విరిగిపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది.

* గోళ్ల రంగు వేసుకుంటే మీ గోళ్ల కింద నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు వచ్చినా, గోళ్ల సహజ రంగు మారి పసుపు లేదా నీలం రంగులోకి మారినా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఇవి కేవలం సాధారణ అలర్జీలు మాత్రమే కాకుండా, కొన్నిసార్లు తీవ్రమైన చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

* గోళ్లలో ఏవైనా మార్పులు లేదా నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా నిపుణులైన చర్మవైద్యుడిని సంప్రదించాలి.

* తరచూ గోళ్ల పరిశుభ్రతను పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. రోజూ సమతుల్య ఆహారం తీసుకుంటూ.. తగినంత నీరు తీసుకుంటే మీ చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్