కంప్యూటర్ పిల్లలం
ఈ కాలపు వెలుగులం
చూసింది విన్నది
వెను వెంటనే మా సొంతం
బట్టి పట్టి చదవము
చేయడం వల్ల నేర్చుతం
అమ్మ భాష మాకిష్టం
అన్య భాష యమ ఇష్టం
కథలెన్నో చదువుతాం
కవితలన్ని రాసేస్తాం
షేక్స్పియర్ చెప్పినట్టి
స్టోరీలు అల్లుతాం
చిక్కు లెక్కలు విప్పినట్టి
రామానుజన్ వారసులం
ప్రయోగాలు చేసినట్టి
సివి రామన్ బిడ్డలం
అబ్దుల్ కలాం చెప్పినట్టు
కలలెన్నో కంటుంటం
ఆటలెన్నో ఆడుతాం
పాటలన్ని పాడుతాం
చరితనంత తిరిగేసి
కొత్త చరిత రాసేస్తం
మేమే మేమే బాలలం
అమ్మానాన్నల ముద్దులం
కంప్యూటర్ వెలుగులం
ఈ కాలపు బుడుగులం
భరతమాత బిడ్డలం
రేపటి తరం వారసులం
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
చిన్న మాదారం, 94415 61655.







కామెంట్‌లు (0)