సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ శుభ్రత ఇలా ...

1 గంట క్రితం

fan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 02:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిరి కారణంగా కిచెన్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై క్రమంగా జిడ్డు, దుమ్ము పేరుకుపోతుంటాయి. దీంతో ఫ్యాన్ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. సాధారణంగా శుభ్రం చేయాలంటే ఫ్యాన్‌ను పూర్తిగా విప్పాల్సి ఉంటుంది. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో ఫ్యాన్‌ను తీయకుండానే మెరిసేలా శుభ్రం చేసుకోవచ్చు.

వెనిగర్ లేదా అమోనియా స్ప్రే ట్రిక్

ఒక స్ప్రే బాటిల్‌లో సమాన మోతాదులో వేడి నీరు, వైట్ వెనిగర్ (లేదా కొద్దిగా లిక్విడ్ అమోనియా), కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలపాలి. ముందుగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ కింద పాత పేపర్ లేదా క్లాత్ వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ బ్లేడ్లు, జాలిపై స్ప్రే చేసి 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. జిడ్డు మెత్తబడిన తర్వాత పాత టూత్‌బ్రష్ లేదా స్పాంజ్‌తో రుద్ది శుభ్రం చేసి, పొడి క్లాత్‌తో తుడిచేస్తే ఫ్యాన్‌పై పేరుకున్న జిడ్డు, దుమ్ము తొలగిపోతాయి.

​బేకింగ్ సోడా పేస్ట్‌తో జిడ్డుకు చెక్

ఒక గిన్నెలో మూడు చెంచాల బేకింగ్ సోడా, కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్, గోరువెచ్చని నీటిని కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఫ్యాన్‌పై ఎక్కువగా జిడ్డు పేరుకున్న ప్రాంతాల్లో టూత్‌బ్రష్ సహాయంతో రాయాలి. సుమారు 20 నిమిషాల తర్వాత తడి స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడిచేయాలి. బేకింగ్ సోడా నూనె మరకలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.

స్టీమ్ క్లీనింగ్ లేదా హీట్ ట్రిక్

ఇంట్లో స్టీమ్ క్లీనర్ ఉంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను విప్పకుండా శుభ్రం చేయవచ్చు. ముందుగా కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్‌ను ఫ్యాన్‌పై స్ప్రే చేసి, ఆ తర్వాత స్టీమ్ క్లీనర్‌తో ఆవిరి ఇవ్వాలి. స్టీమ్ క్లీనర్ లేకపోతే హెయిర్ డ్రైయర్ నుంచి వచ్చే వేడి గాలిని కూడా ఉపయోగించవచ్చు. వేడి ప్రభావంతో గట్టిగా పేరుకున్న నూనె కరిగి సులభంగా తొలగిపోతుంది. తర్వాత శుభ్రమైన క్లాత్‌తో తుడిస్తే ఫ్యాన్ కొత్తదిలా కనిపిస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్