శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సూర్యుడే ఉపాధ్యాయుడు

04 సెప్టెంబర్, 2026

teacher
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 03:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉదయించే సూర్యుడు

ఉద్యమించే వీరుడు

మహిలో ఉపాధ్యాయుడు

భవిత నిర్మాణకుడు

​

పంచును విజ్ఞానము

త్రుంచును అజ్ఞానము

వెలిగించును బ్రతుకులు

మురిపించును మనసులు

​

గుణంలోన శ్రేష్టుడు

అందరికీ ఇష్టుడు

విద్యార్థుల బతుకున

కనిపించే దేవుడు

​

చూపుతాడు మార్గము

చేర్చు విజయ తీరము

మిగుల పూజనీయుడు

కడు అభిమానపాత్రుడు

​

గౌరవించు గురువును

దొరుకునోయ్! దీవెనలు

వారు చేయు బోధను

గైకుంటే మేలులు

​

అత్యుత్తమ వృత్తిలో

ఉన్నవారు గురువులు

అసమానులు సృష్టిలో

పూజిస్తే వేల్పులు


- గద్వాల సోమన్న,

ఎమ్మిగనూరు, 99664 14580.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్