బతుకున యుద్ధాన్ని మోస్తూ
ఆంక్షల కంచెల్ని దాటుకుంటూ
ఎలిసి పోయిన కళ్ళతో అలసి పోయిన ఒళ్ళుతో
మాడిపోయన పొట్టతో మాసిపోయిన గుడ్డలతో
దేశాన్ని పోరాట కూడల్ని చేసిన జెన్ జి ల్లారా .....
మీది చెదరని సంకల్పం!
మీ రేపటి భవిష్యత్తుపై లాఠీలు పిప్పవుతున్నాయి
ఉద్యమ స్వరపేటికల్ని ఖాకీ బూట్లు కావరంగా నలుపుతున్నాయి
గేలన్ల కొద్దీ నీటి గుళ్ళు నినాదాల గుండెల్ని చిట్లదీస్తున్నాయి
భాష్ప వాయువుల వలయాలు మీ ఊపిరుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నయి
మీది తరగని ఆత్మ విశ్వాసం!
నీటి సుక్కతోనో రొట్టెముక్కతోనో
కడుపు నింపుకున్నారో లేదో
ఫుట్ పాత్ మీదైనా కంటినిండా కునుకు తీస్తున్నారో లేదో
పై మీద బట్టే పామై కరచినట్టు
నీ ఓటే నీకు వెన్నుపోటైంది
పచ్చని బతుక్కోసం తొలకరి చినుకులా తోడవుతాడనుకున్న పాలకుడు
అగ్ని కర్తై కరవు దెబ్బ కొడుతున్నాడు
రాజ్యపోడు నీ పాలిట రాకాసిగాడయ్యాడు
చట్టబద్దంగానే పాలకుడు
చట్టాలను పాతరేస్తున్నాడు
న్యాయ సమ్మతమేనంటూ ఉద్యమాలపై
అణచివేత కొనసాగిస్తున్నాడు
మతం మత్తులోకి దేశాన్ని మంత్రించేసాడు
సర్వ వ్వస్థల్ని గమ్మత్తుగా
తన గుప్పిట్లో పెట్టుకున్నాడు
ప్రశ్నిస్తున్న గొంతులుపై ఉపాను ఉసిగొలుపుతున్నాడు
నిలదీస్తున్న పిడికిళ్లుకి బేడీలు తొడుగుతున్నాడు
తన మందీ మార్భలంతో దుర్భాషలాడిస్తున్నాడు
ఎదురు తిరిగిన మీరు రాజ్యానికి ఎగ్గర్తయ్యారు
తానుతీనవుతున్న ఈ దేశాన్ని
తాడులా కుట్టి తోవలోకి తేగల తెగువ మీది
పరేశకమవుతున్న ప్రజాస్వామ్యాన్ని
పరిరక్షించుకనే పోరాటపు పటిమ మీది
ప్రభుత్వం బూటకమైపుడు
హింసే దాని సాధనమవుతుంది
ప్రజలు మేలుకొన్నపుడు
తిరుగుబాటు సత్యమవుతుంది
ఒక సామాజిక సందర్భం కోసం
నిర్బంధ చీకటి మీద నడుస్తున్న దివిటీలు మీరు
ఈ దేశముఖచిత్రాన్ని తిరగ రాస్తున్న చారిత్రక మలుపు మీరు!
- కలమట దాసు బాబు, 80967 03363








కామెంట్లు (0)