- దర్శకుడు వంశీ, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాక
ప్రజాశక్తి - భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో భీమవరంలోని ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 25న సాహితీ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కుమార్ కూనపరాజు, పి.శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు, రచయిత వంశీ, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. కథ, నవల, కవిత, గేయం అనే నాలుగు ప్రక్రియల్లో ప్రముఖ కవులు, రచయితల ఉపన్యాసాలు, కొత్త కవులు, కథకులు, గేయ రచయితలతో సంభాషణ, ఇష్టాగోష్టులు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ‘గోదావరి అలలు’ అనే కథల, కవితల సంకలన పుస్తకావిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు ప్రసాదమూర్తి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, కుప్పిలి పద్మ, శిఖామణి, బహశా వేణుగోపాల్, అనిల్ డ్యానీ, మెర్సీ మార్గరేట్, తేడి ప్రకాష్లు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సంస్కృతిని పోత్సహించడానికి, పెంపొందించటానికి జరిగే ఈ ఉత్సవంలో సాహిత్యాభిమానులు, కళాభిమానులు యువరచయితలు, కవులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.








కామెంట్లు (0)