శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

1 గంట క్రితం

pavan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 12:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విజయవాడ నుంచి వంగవీటి రాధాకృష్ణ

ప్రజాశక్తి-విజయవాడ : మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో రెండు కార్పొరేషన్లతో పాటు 12 మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి జాబితాలో మొత్తం 14 మంది అభ్యర్థులకు స్థానం కల్పించారు. మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు తదుపరి జాబితాల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

కార్పొరేషన్ల అభ్యర్థులు

విజయవాడ కార్పొరేషన్ నుంచి వంగవీటి రాధాకృష్ణ , ఏలూరు కార్పొరేషన్ నుంచి రెడ్డి అప్పలనాయుడు పోటీ చేయనున్నారు.

మున్సిపాలిటీల అభ్యర్థులు

అమలాపురం నుంచి నల్లా శ్రీధర్, చిలకలూరిపేట నుంచి తోట రాజరాజేశ్వరి, గొల్లప్రోలు నుంచి కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురం నుంచి కొత్తపల్లి శైలజ, నిడదవోలు నుంచి కల్లం జ్యోతి, పెడన నుంచి మట్టా శివపావని, పిఠాపురం నుంచి డాక్టర్ బీరా విజయ్ శేఖర్, పుత్తూరు నుంచి డి. ఏలుమలై, సాలూరు నుంచి గొర్లె విజయకుమారి, సామర్లకోట నుంచి పిట్టా జానకి రామారావు, తెనాలి నుంచి తోటకూర వెంకట రమణారావు, తిరువూరు నుంచి పి. మాధవి అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్