
పిఠాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
పల్నాడు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 47.8 శాతం ఓటింగ్ నమోదు.
👉చిలకలూరిపేట లో 45.5 శాతం
👉వినుకొండ లో 47.28 శాతం
👉మాచర్ల లో 48.54 శాతం
👉సత్తెనపల్లి లో 51.91 శాతం
గుంటూరు నగర పాలక సంస్థ.
మధ్యాహ్నం 1 గంటకు 30.94% పోలింగ్
1,91,413 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.


మార్కాపురం మున్సిపాలిటీలో ఆరవ వార్డు ఎన్నిక జరుగుతున్న అటవీశాఖ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో టిడిపి, వైసీపీ మధ్య ఘర్షణ. ఇరు వర్గాలను చెదరగొడుతున్న పోలీసులు
మార్కాపురం పురపాలక సంఘం
మొత్తం ఓటర్ సంఖ్య - 56113
1.00 గంట .ల వరకు పోలైన ఓట్ల సంఖ్య - 28,442
ఓట్ల శాతం - 50.68%
శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం 1.00 గంటకు పోలింగ్ శాతం
ఇచ్ఛాపురంలో 1.00 గంట సమయానికి 39.89 శాతం పోలింగ్ అయ్యింది.12555 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు
శ్రీకాకుళం జిల్లా :
మాజీ వైస్ చైర్మన్ సహా పలువురు అరెస్ట్
11 వార్డు పద్మనాభ పురం కాలనీలో 11/1, 11/2 పోలింగ్ కేంద్రాల వద్ద మాజీ వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబు, ఆర్ట్ లక్ష్మణ్, బోనెల రవి ఓటర్లను బెదిరించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.


మున్సిపల్ పోలింగ్.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
విజయవాడ : ఎపి లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి ఓటు వేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య వసుంధరతో కలిసి వచ్చి ఓటు వేశారు. విజయవాడలో కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, స్వతంత్ర అభ్యర్థి ఎబి వెంకటేశ్వరరావు ఓటు వేశారు. విశాఖపట్నంలోని ఎన్.టి.కాలేజ్ పోలింగ్ కేంద్రంలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నర్సీపట్నంలో ఓటు వేసిన అయ్యన్న, విజయ్
ప్రజాశక్తి - నర్సీపట్నం, (యలమంచిలి విలేకరులు) : అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. నర్సీపట్నం మున్సిపాలిటీలో 49099 మంది ఓటర్లు ఉండగా ఉదయం 9 గంటల సమయానికి 8212 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 16.72 శాతం పోలింగ్ నమోదయింది. నర్సీపట్నంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన భార్య పద్మావతి, కుమారుడు ఎంపీ విజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసిపి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఓటు వేశారు. యలమంచిలి మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో 36 వేలా 526 మంది ఓటర్లు ఉండగా ఉదయం 9 గంటల సమయానికి 2,461 ఓట్లు నమోదయ్యాయి. 6.7 పోలింగ్ శాతం నమోదయింది.
ఎపి లో పుర పోరు.. ఇప్పటివరకూ నమోదైన ఓట్ల శాతం
అమరావతి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకూ నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు విడుదల చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో 19.51 శాతం,
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట 7.65 శాతం,
నర్సీపట్నం 16.72 శాతం,
కొండపల్లి 3.23 శాతం,
తిరువూరు 14.36 శాతం,
నందిగామ 18 శాతం,
ఇచ్చాపురం 5.31 శాతం,
పాలకొండ 12 శాతం,
నెల్లిమర్ల 9.33 శాతం,
పెడన 8 శాతం,
బొబ్బిలి 17.77 శాతం,
కుప్పంలో 19.51 శాతం,
విజయవాడలో 2.14 శాతం,
విశాఖలో 3.34 శాతం,
తిరుపతిలో 11.07 శాతం,
గుంటూరు కార్పొరేషన్ లో 8 శాతం,
నెల్లూరు కార్పొరేషన్‌లో 5.89 శాతం,
కడప కార్పొరేషన్‌లో 7.7 శాతం,
చీరాలలో 12 శాతం,
వినుకొండలో 9 శాతం,
ఒంగోలు కార్పొరేషన్‌లో 9.22 శాతం,
అద్దంకి 10.55 శాతం,
చీమకుర్తి మున్సిపాలిటీలో 16.21 శాతం,
గిద్దలూరు మున్సిపాలిటీ 12. 40 శాతం,
మార్కాపురం 8 శాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన చోట్ల కూడా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు 11 గంటలకు మరిన్ని వివరాలు అందజేస్తామని తెలిపారు.
13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ఓటింగ్
ప్రజాశక్తి-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కార్పొరేటర్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
మున్సిపల్ ఎన్నికల తాజా సమాచారం ఎప్పటికప్పుడు...

విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

పులివెందులలో ఉద్రిక్తత.. రాళ్ల దాడి
పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం
ప్రజాశక్తి – పులివెందుల టౌన్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పులివెందులలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 8, 9, 10వ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు వచ్చిన వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు రాళ్ల దాడి చేసినట్లు వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సామాన్య ప్రజలు ఓటు వేసేందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బాలుర జూనియర్ కళాశాలలోని 1, 2వ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అయితే పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఓటర్లు వాపడ్డారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హిందూపురం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ తన సతీమణి వసుంధర దేవితో కలిసి ఉదయం 8 గంటలకు చౌడేశ్వరి కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెనాలి ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నున్నపనేని రాజకుమారి దంపతులు
చీమకుర్తిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్
ప్రజాశక్తి – ఒంగోలు : ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
పోలీసుల తీరుపై వైసీపీ చైర్మన్ అభ్యర్థి నిరసన
జింకా వెంకట చలపతిని పక్కకు లాగిన పోలీసులు.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన
ప్రజాశక్తి–బి.కొత్తకోట : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బి.కొత్తకోటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ నంబర్ 16లో వైఎస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని, టీడీపీ ఏజెంట్లను మాత్రం అనుమతించి మాక్ పోలింగ్ నిర్వహించారని వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకట చలపతి ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఎస్‌ఐ శివకుమార్‌తో పాటు పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, లాఠీతో కొట్టడంతో పాటు తోసివేయడంతో తనకు గాయాలయ్యాయని చలపతి ఆరోపించారు. దీంతో ఆయన అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించే వరకు నిరసన విరమించబోనని స్పష్టం చేశారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వెంకటగిరి 35వ వార్డులో బ్యాలెట్ పత్రాల తారుమారు
గుర్తించిన అధికారులు.. గంట ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
ప్రజాశక్తి – తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లాలోని వెంకటగిరి మున్సిపాలిటీ 35వ వార్డులో బ్యాలెట్ పత్రాలు తారుమారయ్యాయి. పోలింగ్ ప్రారంభానికి ముందు ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. తప్పుగా ఉన్న బ్యాలెట్ పత్రాల స్థానంలో సరైన బ్యాలెట్ పత్రాలను ఓటర్లకు అందించారు.
ఈ పరిణామంతో 35వ వార్డులో పోలింగ్ ప్రక్రియ సుమారు గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
30వ వార్డు వైసీపీ అభ్యర్థిని కోటగిరి పూర్ణిమ ఇంట విషాదం
గుండెపోటుతో భర్త కోటగిరి సతీష్ (53) ఆకస్మిక మృతి
ప్రజాశక్తి – నూజివీడు టౌన్ :నూజివీడు పట్టణంలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిని కోటగిరి పూర్ణిమ ఇంట ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త కోటగిరి సతీష్ (53) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.
57 వ డివిజన్ లో ఉదయం ఏడున్నర గంటలకు బారులు తీరిన ఓటర్లు

పిఠాపురంలో ప్రారంభమైన పోలింగ్
పోలీస్ బందోబస్తు పరిశీలించిన కాకినాడ డిఎస్పీ దుర్గారావు
ప్రజాశక్తి పిఠాపురం: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వస్తున్న ఏర్పాటు చేశారు పోలీసు బందోబస్తు కాకినాడ డిఎస్పి దుర్గారావు పరిశీలించారు.
నూజివీడులో పోలింగ్ రోజు విషాదం.. అభ్యర్థిని భర్త గుండెపోటుతో మృతి
ప్రజాశక్తి – నూజివీడు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. నూజివీడు మున్సిపాలిటీలోని 30వ వార్డు నుంచి అభ్యర్థినిగా పోటీ చేస్తున్న కోటగిరి పూర్ణిమ భర్త ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
55వ డివిజన్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారు!
ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో బ్యాలెట్ పేపర్లలో ఎన్నికల గుర్తులు తారుమారయ్యాయి. 55వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ఎదురుగా హస్తం గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు ముద్రించారు. ఈ విషయాన్ని గుర్తించిన వైసీపీ అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన రిటర్నింగ్ అధికారి చక్రవర్తి 55వ డివిజన్‌లో పోలింగ్‌ను నిలిపివేశారు.

వైసీపీ చైర్మన్ అభ్యర్థి ప్రమీలమ్మ కారుపై రాళ్ల దాడి.. పగిలిన కారు అద్దాలు
ప్రజాశక్తి – పులివెందుల టౌన్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ చైర్మన్ అభ్యర్థి ప్రమీలమ్మ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఆదివారం స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు ఆమె వెళ్లారు. ఈ సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆమె కారుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి.
విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎబి వెంటేశ్వర్లు..
విజయవాడ : విజయవాడలో ఏబీ వెంకటేశ్వరరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, శనివారం కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేస్తుండగా తమవారు వీడియోలు చిత్రీకరించారని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.

తిరుపతి 66వ వార్డులో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి
ప్రజాశక్తి – తిరుపతి : తిరుపతిలోని 66వ వార్డు పరిధిలో ఆదివారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 6.50 గంటల నుంచే మహిళలు, పురుషులు, యువత పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఓటర్ల గుర్తింపు వివరాలను పరిశీలించిన అనంతరం పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు.








కామెంట్‌లు (0)