శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకూటమిలో తేలని సీట్ల సర్దుబాటు

1 గంట క్రితం

cbn and pk.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 11:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 8 జెడ్‌‌పి ఛైర్మన్లు కోరుతున్న జనసేన!

  • చంద్రబాబుతో పవన్‌ మరోసారి భేటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి కూటమిలో సీట్ల సర్దుబాబు తేలలేదు. జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి స్థానాలతో పాటు జెడ్‌‌పి, ఎంపిపి ఛైర్మన్ల వాటా ఎవరికి ఎంతో తేలాల్సి ఉంది. ఈ అంశంపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ‌శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో స్థానిక జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి స్థానాల్లో సీట్ల సర్దుబాటు అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి తరపున కొంతమంది రెబల్‌‌గా నామినేషన్లు దాఖలు చేశారు. అదే విధంగా జెడ్‌‌పి, ఎంపిటిసి స్థానాలకు కూడా కూటమిలోని ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ రెబల్‌ అభ్యర్థుల అంశం కూటమికి తలనొప్పిగా మారింది. ఆశావాహులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా.. కొంతమంది వెనక్కి తగ్గడం లేదు. ఈ అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. జెడ్‌‌పి, ఎంపిపి ఛైర్మన్ల ఎంపిక నేరుగా కాకుండా ఎన్నికల తరువాత పరోక్షంగా ఎన్నిక చేయాల్సి ఉంటుంది. కావున 28 జిల్లాల్లో జెడ్‌‌పి ఛైర్మన్లు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే 8 స్థానాలు జనసేనకు కేటాయించాలని చంద్రబాబును పవన్‌ ‌కోరినట్లు సమాచారం. మున్సిపల్‌ ‌స్థానాల్లో కొంత తగ్గామని, ఆ మేర జెడ్‌‌పి స్థానాల్లో సర్దుబాటు చేయాలనే ప్రతిపాదనను చంద్రబాబు వద్ద ఉంచినట్లు తెలిసింది. అయితే 5 నుంచి 6 స్థానాలు జనసేనకు, ఒక స్థానం బిజెపికి మిగిలిన స్థానాలను టిడిపికి కేటాయించే అవకాశం ఉన్నట్లు కూటమిలో చర్చ నడుస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్