శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హెడ్‌కోచ్‌ పదవి రేసులో ఐదుగురు

1 గంట క్రితం

bcci
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 01:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి: టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి బిసిసిఐ సెలెక్ష‍న్‌ కమిటీ ఐదుగురిని ఇంటర్వ్యూ చేసింది. గౌతం గంభీర్‌ పదవీకాలం ముగియనున్న క్రమంలో తాజాగా హెడ్‌కోచ్‌ పదవికి బిసిసిఐ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వీరిలో ముంబయికి చెందిన వసీం జాఫర్‌, రమేష్‌ పొవార్‌తోపాటు బరోడాకు చెందిన సలీల్‌ అంకోలా ఉన్నారు. అలాగే విదేశాలకు చెందిన జాకబ్‌ మార్టీన్‌, కానర్‌ విలియమ్స్‌ కూడా బిసిసిఐ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అశోక్ మల్హోత్రా మరియు జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ, గురువారం ఇంటర్వ్యూలను నిర్వహించినట్లు బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. ఐదుగురితో షార్ట్‌లిస్ట్‌ తయారు చేసిన సెలెక్ష‍న్‌ కమిటీ.. ప్రధానంగా ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వసం జాఫర్‌, రమేష్‌ పొవార్‌ ప్రధానంగా హెడ్‌ కోచ్‌ పదవికి అందరికంటే ముందు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్