సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionIND A vs NZ A : ఆధిక్యం దిశగా కివీస్‌-ఎ

17 గంటల క్రితం

test.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 10:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • భారత్‌-ఎతో రెండో అనధికార టెస్టు

క్రైస్ట్‌చర్చ్‌ : భారత్‌-ఎతో రెండో అనధికార టెస్టులో న్యూజిలాండ్‌-ఎ ఆధిక్యం దిశగా సాగుతోంది. కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ (105, 171 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), టెయిలెండర్‌ ఆకాశ్‌ దీప్‌ (68, 116 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్‌ (80, 140 బంతుల్లో 12 ఫోర్లు) రాణించటంతో భారత్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 10 వికెట్లకు 346 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 62 ఓవర్లలో 3 వికెట్లకు 218 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాస్‌ (4), కర్టీస్‌ (4) సహా టిమ్‌ రాబిన్సన్‌ (3) 8 ఓవర్లలకే పెవిలియన్‌కు చేరారు. ముకేశ్‌ కుమార్‌ (2/44), సిరాజ్‌ (1/49) భారత్‌కు అదిరే బ్రేక్‌ అందించారు. కానీ, మాథ్యూ (107 నాటౌట్‌ 148 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌), డీన్‌ ఫోక్స్‌కార్ట్‌ (80 నాటౌట్‌, 180 బంతుల్లో 9 ఫోర్లు) నాల్గో వికెట్‌కు అజేయంగా 205 పరుగులు జోడించారు. రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్