- ఇండియా మహిళలు తొలి ఇన్నింగ్స్ 285 ఆలౌట్
లండన్: లార్డ్ వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మహిళల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకి తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఆల్‌రౌండ్ దీప్తి శర్మ అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 74.5ఓవర్లలో 285పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. షెఫాలీ వర్మ(0) తాను ఎదుర్కొన్న నాల్గో బంతికి డకౌటైంది. దీంతో భారతజట్టు 4పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత యాస్టికా భాటియా(12) కూడా త్వరగా పెవీలియన్‌కు చేరడంతో 37పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో రోడ్రిగ్స్(35)తో కలిసి మంధాన కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్‌కు 64పరుగులు జోడించారు. అర్ధసెంచరీకి చేరువలో రోడ్రిగ్స్‌ను వాంగ్ ఔట్ చేయడంతో టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్(58), మంధాన(85) కలిసి 4వ వికెట్‌కు 89పరురొలు జతచేసి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత వీరిద్దరూ ఒకరి వెం మరొకరు ఔటయ్యారు. ఆ తర్వాత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(57) ఆదుకున్నా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు స్నేహ్‌రాణా, సయాలీ నిరాశపరిచారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 285పరుగులకు ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లేస్టోన్‌కు మూడు, లారెన్ ఫిలెర్, వాంగ్, విల్లెర్స్‌కు రెండేసి, లారెన్ బెల్‌కు ఒక వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు...
ఇండియా మహిళల తొలి ఇన్నింగ్స్: మంధాన (సి)అమీ జోన్స్ (బి)వాంగ్ 83, షెఫాలీ వర్మ (సి)అమీ జోన్స్ (బి)లారెన్ ఫిలెర్ 0, యాస్టికా భాటియా (బి)లారెన్ బెల్ 12, రోడ్రిగ్స్ (బి)వాంగ్ 35, హర్మన్‌ప్రీత్ కౌర్ (బి)మాడీ విల్లెర్స్ 58, దీప్తి శర్మ (సి)హీథర్ నైట్ (బి)ఎక్లేస్టోన్ 57, రీచా ఘోష్ (సి)వాంగ్ (బి)లారెన్ ఫిల్లెర్ 13, స్నేహ్ రాణా (బి)మాడీ విల్లెర్స్ 13, సయాలీ (ఎల్‌బి)ఎక్లేస్టోన్ 1, క్రాంతిగాడ్ (బి)ఎక్లేస్టోన్ 1, శ్రీచరణి (నాటౌట్) 3, అదనం 9, (74.5ఓవర్లలో ఆలౌట్) 285పరుగులు. వికెట్ల పతనం: 1/4, 2/37, 3/101, 4/190, 5/202, 6/229, 7/274, 8/279, 9/282, 10/285 బౌలింగ్: లారెన్ బెల్ 9-0-50-1, లారెన్ ఫిలెర్ 13-1-40-2, ఎక్లేస్టోన్ 21.5-2-68-3, వాంగ్ 12-0-41-2, మాడీ విల్లెర్స్ 19-1-79-2.








కామెంట్‌లు (0)