బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టాప్‌-7లోకి దూసుకొచ్చిన శ్రేయస్‌

1 గంట క్రితం

shreyas iyer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 04:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో సెంచరీతో చెలరేగిన భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. ఏకంగా 18 స్థానాలు ఎగబాకిన శ్రేయస్‌ 786 పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసిన శ్రేయస్‌కు ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో మంచి ప్రయోజనం లభించింది.

టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన ఇషాన్‌ కిషన్‌ 902 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, అభిషేక్‌ శర్మ 887 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసియా క్రీడల ఫైనల్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన తిలక్‌ వర్మ 719 పాయింట్లతో తొమ్మిదో స్థానం నుంచి పదో స్థానానికి పడిపోయాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ భారత ఆటగాళ్లు పురోగతి సాధించారు. అక్షర్‌ పటేల్‌ 16 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకోగా, జస్‌ప్రీత్‌ బుమ్రా మూడు స్థానాలు మెరుగుపరుచుకుని పదో ర్యాంక్‌లో నిలిచాడు.

వన్డేల్లో గిల్‌దే అగ్రస్థానం

వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో ద్విశతకం సాధించిన గిల్‌, మూడో మ్యాచ్‌లో త్వరగా ఔటైనప్పటికీ తన నంబర్‌వన్‌ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. డారిల్‌ మిచెల్‌ 794 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకోగా, విరాట్‌ కోహ్లీ 781 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. రోహిత్‌ శర్మ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్