- సిరీస్ 2-2తో సమం
- సంయుక్త విజేతలు భారత్, వెస్టిండీస్
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హోప్
బెంగళూరు: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐదో, చివరి టి20 వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ వర్షం కురవడంతో నిర్ణీత సమయానికి మ్యాచ్ ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కొద్దిసేపు వర్షం నిలవడంతో రాత్రి 9గంటల తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. 9 ఓవర్లకు కుదించి మ్యాచ్‌ను ప్రారంభించగా.. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు 7.4ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (6), సంజు శాంసన్ (16) వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యారు. ఇషాన్ కిషన్ (10 బంతుల్లో 30) మెరుపు దాడి చేశాడు. ఇషాన్ తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అలరించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (14 బంతుల్లో 22) కూడా ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. చివర్లో నమన్ ధీర్(23నాటౌట్; 6బంతుల్లో ఫోర్, 3సిక్సర్లు) రాణించడంతో భారత్ 7.4 ఓవర్ల 118 పరుగులు చేసింది. తిలక్ వర్మ (7) ఐదో వికెట్‌గా ఔటైన వెంటనే వర్షం మళ్లీ మొదలైంది. విండీస్ బౌలర్లలో కీమో పాల్, షమార్ స్ప్రింగర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దుచేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఐదు టి20ల సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమంగా నిలవడంతో సంయుక్త విజేతగా అంపైర్లు ప్రకటించారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ షాయ్ హోప్‌కు లభించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నిర్ణీత సమయానికి టాస్ వేయడం సాధ్యపడలేదు. దీంతో మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు కనీసం వార్మప్ చేసుకొనే అవకాశం కూడా దక్కలేదు. ఐపిఎల్‌లో ఆర్సీబీ జట్టు 2025లో తొలిసారి విజేతగా నిలవడం, అనంతరం ఈ మైదానంలో తొక్కిసలాట జరిగి అభిమానులు మృతిచెందడంతో ఈ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు రెండేళ్లపాటు జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత చిన్నస్వామి స్టేడియం ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చినా.. అభిమానులకు చివర్లో వర్షం అడ్డంకిగా నిలిచి రద్దుకావడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. గత ఏడాది ఆగస్టులో విండీస్ పర్యటనలో 2-3 తేడాతో సిరీస్ కోల్పోయిన భారత్, ఈసారి సొంతగడ్డపై బదులు తీర్చుకోవాలని చూసినా ప్రయోజనం లేదు. టి20 సిరీస్‌లో విండీస్ కెప్టెన్ కెప్టెన్ షాయ్ హోప్ (2 శతకాలతో 261 పరుగులు) రాణించాడు.
స్కోర్‌బోర్డు...
ఇండియా ఇన్నింగ్స్: సంజు శాంసన్ (సి)స్ర్పింగర్ 16, అభిషేక్ శర్మ (సి)జోసెఫ్ (బి)కీమో పాల్ 6, ఇషాన్ కిషన్ (సి)రువాన్ పావెల్ (బి)జోసెఫ్ 30, శ్రేయస్ అయ్యర్ (సి)జోసెఫ్ (బి)కీమో పాల్ 22, తిలక్ వర్మ (సి)స్ర్పింగర్ 7, నమన్ ధీర్ (నాటౌట్) 24, అదనం 13. (7.4ఓవర్లలో) 5 వికెట్ల నష్టానికి) 118 పరుగులు. వికెట్ల పతనం: 1/13, 2/45, 3/66, 4/88, 5/118 బౌలింగ్: కీమో పాల్ 2-0-34-2, షెఫర్డ్ 1-0-24-0, జోసెఫ్ 1-0-18-1, మోటీ 2-0-25-0, స్ర్పింగర్ 1.4-0-17-2.







కామెంట్లు (0)