నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో సెమీస్ మ్యాచ్
అండర్-19 ఆసియాకప్
ఉదయం 10.30గం.ల నుంచి
మస్కట్(ఒమన్): అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు నేడు కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్ట ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో యుఎఇపై 70 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మరోవైపు ఇదే గ్రూప్‌లో టాప్‌లో నిలిచిన పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌తో రెండో సెమీస్‌లో తలపడనుంది. భారత యువ జట్టు గ్రూప్ దశలో నేపాల్, యూఏఈపై విజయాలు సాధించింది. అయితే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతొ గ్రూప్-ఎలో రెండు విజయాలతో 2వ స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు గ్రూప్-ఎలో పాకిస్తాన్ అద్భుత ఫామ్‌లో ఉంది. ఆ జట్టు గ్రూప్ దశలో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయాలను నమోదు చేసుకొని టాప్‌లో నిలిచింది. తొలి మ్యాచ్‌లో యుఎఇపై 9వికెట్ల తేడాతో నెగ్గిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో భారత్‌పై 3వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో గ్రూప్ లీగ్ చివరి మ్యాచ్‌లో నేపాల్‌పై 101 పరుగుల తేడాతో నెగ్గి 6పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో పాకిస్తాన్ జట్టు గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
అద్భుత ఫామ్‌లో ఆఫ్ఘనిస్తాన్...
అండర్-19 ఆసియా కప్ గ్రూప్-బిలో ఆప్ఘనిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘన విజయం సాధించింది. తొలి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాపై 113 పరుగుల తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్.. రెండో మ్యాచ్‌లో మలేషియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి లీగ్ మ్యాచ్‌లోనూ పటిష్ట శ్రీలంకపై 106పరుగుల తేడాతో నెగ్గిన దుర్భేధ్య ఫామ్‌లో ఉంది. ఈ క్రమంలో భారత యువ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించాలంటే చెమటోడ్చాల్సిందే. సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జట్లు 14న జరిగే ఫైనల్లో టైటిల్ కోసం తలపడనున్నాయి.
జట్లు(అంచనా)...
ఇండియా (అండర్-19)జట్టు: చందాని (కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వినీత్, అర్జున్ రాజ్‌పుత్, యశ్‌బర్దన్ చౌహాన్, అన్వయ్ ద్రావిడ్(వికెట్ కీపర్), మనాల్ చౌహాన్, మోహిత్ ఉర్వా, అర్యాన్ సవాన్సీ, కావ్య పటేల్, ఇషాన్ సూద్.
ఆఫ్ఘనిస్తాన్ (అండర్-19)జట్టు: సొహైల్ ఖాన్(కెప్టెన్), అబ్దుల్లా, ఫరీదుల్లా, సుభాన్ జఖైల్, సలార్జయ్(వికెట్ కీపర్), షా ఫైసల్, తాహిర్, అమీర్, ముబరేజ్, నూర్ అలీ, బిలాల్.







కామెంట్‌లు (0)