శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీడ్కోలు మ్యాచ్‌ ఆడించాల్సింది

13 నిమిషాల క్రితం

ravi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టెస్టులకు షమీ రిటైర్మెంట్‌పై మాజీ కోచ్‌ రవిశాస్ర్తి స్పందన

వెల్లింగ్టన్‌: మహ్మద్ షమీ టెస్టులకు గుడ్‌బై చెప్పడంపై టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి స్పందించాడు. షమీని సెలక్టర్లు కనీసం ఒక్క ఛాన్స్‌ అయినా ఇచ్చి వీడ్కోలు మ్యాచ్‌ ఆడించాల్సిందని అభిప్రాయ పడ్డాడు. కివీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌కు ముందు రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. అతడిలో ఇంకా టెస్టు క్రికెట్ ఆడగల సత్తా ఉందని, దేశం కోసం ఆడాలనే తపన ఉన్న క్రికెటర్‌ ఆటకు వీడ్కోలు చెబితే చాలా బాధ అనిపిస్తుందన్నాడు. షమీకి అవకాశాలు ఇచ్చి ఉంటే కచ్చితంగా మరో 40 వికెట్లు తీయగల సమర్ధుడని, గత ఏడాది నుంచి దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడని తెలిపాడు. ఫిట్‌నెస్‌ పేరుతో అతడ్ని పక్కన పెట్టారని, ఒక్క ఛాన్స్ ఇస్తే, అతని ప్రదర్శన ఎలా ఉందో తెలిసేదన్నాడు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపరిచిందన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున రోజుకు 15-20 ఓవర్లు బౌల్‌ చేశాడని, ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలంటే ఇంకేం చేయాలి’’ అని అన్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్