సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

NZ vs IND: టెస్టు సిరీస్‌ - రెండు టీంలుగా భారత క్రికెట్ కోచింగ్‌ స్టాఫ్‌

8 గంటల క్రితం

NZ vs IND Test Series Indian Cricket Coaching Staff Split into Two Teams
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 12:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూజిలాండ్ : న్యూజిలాండ్‌తో మూడో వన్డే ముగిసిన అనంతరం భారత క్రికెట్‌ జట్టు కోచింగ్‌ సిబ్బంది రెండు బృందాలుగా విడిపోనున్నారు. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌.. మంగళవారం హామిల్టన్‌లో జరిగే మూడో మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో హామిల్టన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కోటక్‌ జట్టు ప్రణాళికలపై వివరాలు వెల్లడించారు.


ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వన్డే జట్టుతోనే కొనసాగనున్నారని, స్పిన్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే కూడా ఆయనతోనే ఉంటారని కోటక్‌ తెలిపారు. తాను, మోర్నీ మోర్కెల్‌తో పాటు ఇతర కోచింగ్‌ సిబ్బంది టెస్టు జట్టుతో కలిసి వెలింగ్టన్‌కు వెళ్లనున్నట్లు చెప్పారు. అయితే తుది నిర్ణయం గంభీర్‌దేనని, ప్రణాళికల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. టెస్టు ఆటగాళ్ల సాధన, ఫిట్‌నెస్‌ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు.


టెస్టు జట్టుకు ముగ్గురు బౌలర్ల సహకారం ...

వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత గుర్నూర్‌ బ్రార్‌, అకిబ్‌ నబీ, అర్ష్‌దీప్‌ సింగ్‌ న్యూజిలాండ్‌లోనే ఉండనున్నారు. టెస్టు జట్టు బ్యాటర్లకు నెట్‌ ప్రాక్టీస్‌లో సహకరించడంతో పాటు రిజర్వ్‌ ఆటగాళ్లుగా అందుబాటులో ఉంటారని కోటక్‌ వెల్లడించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి టెస్టు ఫార్మాట్‌కు మారడం బ్యాటర్లకు పెద్ద సమస్య కాబోదని అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌ పిచ్‌లపై స్వింగ్‌, బౌన్స్‌ ఉండటంతో టెస్టులకు కూడా అవే పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని చెప్పారు. బుధవారం నుంచి టెస్టు సన్నాహాలు ప్రారంభమవుతాయని, ఐదారు ప్రాక్టీస్‌ సెషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.


కేఎల్‌ రాహుల్ ‌పై ప్రశంసలు ...

కేఎల్‌ రాహుల్‌ ఆటతీరుపై కూడా సితాన్షు కోటక్‌ ప్రశంసలు కురిపించారు. టెస్టుల్లో ఓపెనర్‌గా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మిడిలార్డర్‌ బ్యాటర్‌గా రాణించడం అతడి ప్రత్యేకత అని పేర్కొన్నారు. జట్టుకు అవసరమైన సమయంలో బాధ్యత తీసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. తాను జట్టులో చేరినప్పటి నుంచి రాహుల్‌ బ్యాటింగ్‌కు వచ్చి విఫలమైన సందర్భాలు పెద్దగా గుర్తులేవని, ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారని కొనియాడారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఆడటం అతడి బలమని కోటక్‌ ప్రశంసించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్