శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Rain threat - భారత్‌–వెస్టిండీస్‌ ఐదో టి 20 కి వర్షం ముప్పు !

1 గంట క్రితం

Rain threat for the fifth T20 between India and West Indies!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 05:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : భారత్‌–వెస్టిండీస్‌ జట్ల మధ్య మరికాసేపట్లో జరగనున్న ఐదో టి 20 మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు మ్యాచ్‌లు ముగిసేసరికి సిరీస్‌ 2–2 తో సమంగా ఉండటంతో, ఈ నిర్ణయాత్మక పోరులో గెలిచిన జట్టుకే సిరీస్‌ సొంతం కానుంది. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉండటంతో క్రికెట్‌ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.


బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి వేళ వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ అంచనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మ్యాచ్‌ పూర్తిస్థాయిలో జరుగుతుందా ? లేదా వర్షం కారణంగా సిరీస్‌ ఫలితంపై ప్రభావం పడుతుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


వాతావరణ వివరాల ప్రకారం ... టాస్‌ సమయానికి వర్షం పడే అవకాశం 34 నుంచి 49 శాతం మధ్య ఉండొచ్చని అంచనా. మ్యాచ్‌ ప్రారంభమైన తొలి మూడు గంటల్లో వర్షం ముప్పు 34 శాతం నుంచి 40 శాతానికి పెరగవచ్చని తెలుస్తోంది. ఇక రాత్రి 10 గంటల సమయానికి వర్షం కురిసే అవకాశాలు 78 శాతానికి చేరవచ్చని అక్యూవెదర్‌ పేర్కొంది.


మరోవైపు చిన్నస్వామి స్టేడియంలో వర్షపు నీటిని వేగంగా బయటకు పంపే ఆధునిక డ్రైనేజీ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ భారీ వర్షం కురిస్తే మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడే అవకాశాలను కొట్టిపారేయలేం. దీంతో సిరీస్‌ విజేతను నిర్ణయించే ఈ పోరు సజావుగా సాగుతుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.


ఇప్పటివరకు జరిగిన నాలుగు టి 20 ల్లో భారత్‌, వెస్టిండీస్‌ చెరో రెండు విజయాలు నమోదు చేశాయి. సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే భారత జట్టు ప్రధానంగా బౌలింగ్‌ విభాగంలోని లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా భువనేశ్వర్‌ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకునే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్