- బంగ్లాదేశ్‌తో మూడో చివరి టెస్ట్ డ్రా
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్ 1-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య సోమవారం ముగిసిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. చివరిరోజైన సోమవారం 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఐదోరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన తౌహిద్ హృదోయ్ రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులతో రాణించగా.... ముష్ఫికర్ రహీమ్(49) రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వర్రికన్ మూడు వికెట్లు తీయగా, షమర్ జోసెఫ్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 398 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కవెమ్ హడ్జ్ (142) భారీ సెంచరీ సాధించగా, కెవిన్ విక్‌హమ్ (78) అర్థసెంచరీ చేశాడు. ఇక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌట్ కాగా, విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేసింది. తౌహిద్ హృదోయ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకోగా, సిరీస్‌లో 16 వికెట్లు ఖాతాలో వేసుకున్న జోమెల్ వర్రికన్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్నాడు.
ముష్ఫికర్ రహీం @ 7000 పరుగులు
బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాటర్ ముష్ఫికర్ రహీం అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డుతోపాటు ఈ ఫార్మాట్‌లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.








కామెంట్‌లు (0)