ఓడెన్స్(డెన్మార్క్): డెన్మార్క్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో తాన్వీ శర్మ, డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రీసా జాలీ క్వార్టర్స్‌కు చేరినా.. కీలక పోరులో వీరంతా ఓటమిపాలయ్యారు. మహిళల సింగిల్స్లఓ తాన్వీ శర్మ 15-21, 13-21తో టాప్‌సీడ్, కొరియాకు చెందిన సన్-యే-యంగ్ చేతిలో వరుససెట్లలో ఓటమిపాలైంది. ఇక మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రీసా జాలీ క్వార్టర్ ఫైనల్లో 21-14, 17-21, 11-21తో మలేషియాకు చెందిన 2వ సీడ్ టామ్-తిన్నాహ్ చేతిలో పోరాడి ఓడారు. మూడు సెట్ల పోరు సుమారు 56నిమిషాలసేపు ఉత్కంఠభరితంగా సాగింది. లక్షసేన్, పివి సింధు, పురుషుల డబుల్స్ స్టార్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి జంటలు తొలిరౌండ్లోనే ఓటమిపాలవ్వగా.. కిదాంబి శ్రీకాంత్, ఆయుశ్ శెట్టి ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరి పరాజయం పాలయ్యారు. దీంతో ఈ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.
గాయత్రి-త్రీసా జోడీకి నిరాశ : క్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ షట్లర్ల చేతిలో ఓటమి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 11:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)