mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖనిజాల వెలికితీత, అమ్మకాలు, కొనుగోళ్లు ప్రభుత్వ సంస్థల ద్వారానే జరగాలి : వి.శ్రీనివాసరావు

17 నిమిషాల క్రితం

CPM State secretary V Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 12:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : రాష్ట్రంలోని విలువైన ఖనిజాల వెలికితీత, అమ్మకాలు, కొనుగోళ్లు ప్రభుత్వ సంస్థల ద్వారానే జరగాలి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు మాట్లాడుతూ ... రాష్ట్రంలో అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేటు కంపెనీలు కొల్లగొట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్లుగా కనిపిస్తున్నదన్నారు. రాష్ట్రంలో చాలా విలువైన బంగారు గనులున్నాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన ఖనిజాలను పెద్ద కంపెనీలకు ఇచ్చి రాష్ట్రంలో నుండి విదేశాలకు ఎగుమతి చేసుకొని గాలివాటంగా లాభాలను సంపాదించుకోవడానికి పెద్ద ఎత్తున లూఠీ చేసే అవకాశం కనిపిస్తున్నదన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న ఖనిజ వనరుల వెలికితీత కానీ దాని అమ్మకాలు కొనుగోలు అన్ని కూడా ప్రభుత్వ సంస్థల ద్వారానే జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగితే .... ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని.. అప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు అని స్పష్టం చేశారు. దాంతో ప్రజలపై భారాలు వేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు కొరత ఉండదు అని వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్