అమరావతి : "నా ప్రాణాలకు ముప్పు ఉంది.. కేసు ఒప్పుకోవాలంటూ నాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు" అంటూ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజు న్యాయమూర్తి ముందు సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపిన ఈ కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుకు వచ్చిన సిఐ నాగరాజు మాట్లాడుతూ ... ఈ కేసులో తనను అకారణంగా ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని, బలవంతంగా నిందితుడిగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని న్యాయమూర్తికి తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపిన విచారణకు తాను పూర్తిగా సహకరించానని, తన దగ్గరున్న సమాచారమంతా ఇప్పటికే అధికారులకు ఇచ్చేశానని చెప్పారు. ఇప్పుడు తన వద్ద అదనంగా చెప్పడానికి ఎలాంటి సమాచారం లేదని, పైగా పోలీస్ కస్టడీకి ఇస్తే తన ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని న్యాయమూర్తి ఎదుట మొరపెట్టుకున్నాడు. సస్పెండెడ్ సిఐ నాగరాజు చేసిన ఈ ప్రాణభయం ఆరోపణలను న్యాయస్థానం సీరియస్ గా తీసుకుంది. ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు, ఆరోపణలపై పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా తమకు సమర్పించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు, ఈ లాకప్ డెత్ కేసులో అసలు నిజాలను బయటకు తీసేందుకు సిట్ అధికారులు నాగరాజును 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.
నా ప్రాణాలకు ముప్పు ఉంది : లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 01, 2026, 12:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)