mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'సర్' పేరుతో పౌరుల ఓటు హక్కు తొలగించే కుట్రలను అడ్డుకోవాలి

2 గంటల క్రితం

cpm ap sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 01:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- గడువు పొడిగించాలి

- కేంద్ర ప్రభుత్వ కుట్రలపై టిడిపి, జనసేన, వైసిపి మౌనం వీడాలి

- సి.హెచ్.బాబురావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

ప్రజాశక్తి - విజయవాడ : సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ మొగల్‌రాజుపురంలో పర్యటన. ఎస్.ఐ.ఆర్ జరుగుతున్న తీరు పరిశీలన. ఈ ప్రక్రియలో జరుగుతున్న లోపాలు, ఓటర్లు పడుతున్న ఇబ్బందులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావుఅడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బాబూరావు మాట్లాడుతూ... ''స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో అర్హులైన ఓట్లను తొలగించడానికి కేంద్రం కుట్రపన్నుతున్నది. ఇప్పటికే SIR ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లో 6 కోట్ల ఓట్లను తొలగించింది. ఇప్పుడు మొత్తం ప్రక్రియ పూర్తయితే ఎన్ని కోట్ల మంది ఓట్లు తొలగిస్తారో తెలియదు. ఆంద్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎసఐఆర్ తంతు వలన ఓటర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన ఓటర్లు 25ఏళ్ళ క్రితం ఓట్లు లేకపోతే వారికి ఓటు ఉండదు. యువతకు అప్పుడు ఓట్లు లేవు. ఆధారంగా చూపాల్సిన తల్లితండ్రులకు అప్పుడు ఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈ ఆధారాలన్నీ రుజువుచేయాల్సిన బాధ్యత ఓటర్లపై పెట్టారు. ఈ బాధ్యత ప్రభుత్వానిది. 2002 ముందు వీరు ఎక్కడ ఓటు వేసారు, అప్పుడు ఏ నియోజకవర్గంలో ఉన్నారు అనేది తేల్చి వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పటికీ పత్రాలు ఓటర్లందరికీ అందించలేదు. ఇచ్చిన వారిని పూర్తిచేసి తీసుకురండి అని హడావిడి చేస్తున్నారు. పూర్తి చేసిన పత్రాలు ఎప్పటికపుడు అప్‌లోడ్ జరగడంలేదు. గందరగోళ స్థితి ఏర్పడింది. ఇంటింటికి తిరగాల్సిన తగిన సిబ్బంది లేదు. సిబ్బంది కొరత వలన అదనపు సిబ్బందిని నియమించాలి. ఇంటింటింకి సిబ్బంది తిరిగి పత్రాలు ఇచ్చేలా, అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. గ్రామ సభలు, బూత్ లెవల్ సభలు నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమాలు అన్నీ జరిగి ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలి. అందుకోసం జూలై 15 వరకు ఈ సమయం సరిపోనందున సిపిఎం తరపున గడువు పొడిగిం చాలని ఎన్నికల కమీషన్‌ను కోరాము. ఈ సందర్భంలో ఓటు హక్కు కోల్పోతే ఓటు మాత్రమే కాదు ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు అర్హత కోల్పోయే ప్రమాదం ఉన్నది. రేషన్ కార్డులు, బియ్యం, పెన్షన్‌లు వంటి వాటికి అర్హత లేకుండా చేస్తారు. ఆఖరికి భారత దేశ పౌరసత్వం లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడిలు, రేషన్ కార్డు ఏవీ పనికిరావని చెబుతున్నారు. 25ఏళ్ళ క్రితం ఓటు హక్కు ఉండి ఉంటేనే ఓటు పునరుద్దరించి పౌరులుగా గుర్తిస్తామంటూ నిబంధనలు పెట్టడం ద్వారా కేంద్రం రాజకీయంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీలు ఢిల్లీలో బిజెపిని బలపర్చారు. రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు ఎవరి పార్టీల వారి ఓట్లు ఉన్నాయో లేదో చూసుకునే పనిలో మాత్రమే ఉన్నారు. ప్రజలు, పౌరులు ఓట్లు హక్కులు తీసే ఈ కుట్ర మీద మాత్రం మాట్లాడటం లేదు. అందువలన పౌరసమాజమే గళం విప్పాలని'' అన్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా పరిరక్షించాలని సిపిఎంగా డిమాండ్ చేసింది. ఎన్నికల కమీషన్ కేంద్ర ప్రభుత్వ చేతిలో పనిముట్టులాగా మారిపోయిందని, వారు ఎలా చెబితే అలా ఆడేటువంటి వైఖరి మారాలని డిమాండ్ చేశారు. పౌరుల హక్కును పరిరక్షించేందుకు ఉద్యమించాలని సిపిఎం పిలుపునిస్తున్నదని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్