బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సభవించింది. రంగులను పలుచగా చేసేందుకు ఉపయోగించే థిన్నర్ తయారుచేసే దివ్య ఇంపోర్ట్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన అత్యంత మండే స్వభావం గల రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి, దట్టమైన నల్లటి పొగను ఆకాశంలోకి ఎగజిమ్మడంతో స్థానికులు బెంబేలెత్తారు. జిగాని రోడ్డులోని షెల్ పెట్రోలు బంకు సమీపంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. అయితే ఆదివారం ఫ్యాక్టరీ మూసివేసివున్నందున ప్రమాద సమయంలో ఆ ప్రాంగణంలో కార్మికులు ఎవరూ లేరు. దీంతో ఎవ్వరికీ గాయాలు కానీ, ప్రాణనష్టం కానీ జరగలేదు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల అధికారులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఫ్యాక్టరీ నుండి దట్టమైన నల్లటి పొగ వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఫ్యాక్టరీ యజమాని హరినాథ్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు ఎలక్ర్టానిక్స్ సిటీలో భారీ అగ్నిప్రమాదం
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 28, 2026, 11:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)