- రొట్టెల పండుగ రెండో రోజు గంథమహోత్సవం
ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి: మతసామరస్యానికి ప్రతీకైన రొట్టెల పండుగకు రెండో రోజు భారీగా యాత్రికులు తరలివచ్చారు. దేశ విదేశాల నుంచి వచ్చిన యాత్రికులతో స్వర్ణాల చెరువు కిటకిటలాంది... గంథమహోత్సవం కావడంతో ముస్లిం మత పెద్దలు హాజరవగా, గంథం ఊరేగింపు జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పండుగను పర్వవేక్షిస్తూ యాత్రికులకు భోజన సరఫరా ఏ ర్పాట్లు పరిశీలించారు. పండుగ సందర్భంగా నాలుగు డ్రోన్లు ప్రారంభించారు.నెల్లూరు బారాషాహీద్ రొట్టెల పండుగ, గంథ మహోత్సవం కావడంతో రోజు రోజు భారీగా యాత్రికులు తరలివచ్చారు. తమిళనాడు, కేరళ, తెలంగాణతో పాటు విదేశాల నుంచి యాత్రికులు వచ్చారు. శనివారం సాయంత్రం కొటమిట్టలోని అమీనియా మసీదు నుంచి 12 బిందెలతో గంథం తయారు చేసి ఊరేగింపుగా బారా షాహీద్ దర్గాకు తీసుకొచ్చారు. కడప పెద్ద దర్గాకు చెందిన మత గురువుల ఆధ్వర్యంలో 12 మంది మృతి వీరుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంధం లేపన చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరు క్యూలు ఏర్పాటు చేశారు. రహదారులు వరకు బారులు తీరారు. ఆరోగ్యం, ఉద్యోగం, గృహం, పెళ్లి, సంతానం, కోర్కెల రొట్టె కోసం జనం ఎగబడ్డారు. గుంటూరు రేంజ్ డిఐజి త్రిపాఠి స్వర్ణాల చెరువును సందర్శించి, బందోబస్తు పరిశీలించారు. ఎస్‌పి అజితా వేజండ్ల, ఎఎస్పి సౌజన్య, డిఎస్‌పి దీక్ష, ఈ ఏడాది దాదాపు 30 లక్షల మంది యాత్రికులు వస్తారని అధికారులు అంచనా వేశారు. మతసామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ పండుగకు 400 ఏళ్ల చరిత్ర ఉంది.








కామెంట్‌లు (0)