ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశ్నా రావణ్ అరెస్ట్‌‌ను ఖండించిన కెవిపిఎస్

2 గంటల క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 11:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కెవిపిఎస్‌ ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యూట్యూబర్ ప్రశ్నా రావణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేసి, పదేపదే అరెస్టులకు పాల్పడటాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ఖండించింది. తప్పుడు కేసులతో అమాయకులను వేధించకుండా ఆపాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ఆదివారం ఒక ప్రకటన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో విమర్శలను సహించాల్సిన ప్రభుత్వాలు, వాటిని అణచివేయడానికి అధికారాన్ని వినియోగించడం అత్యంత ఆందోళనకరమైన పరిణామమని పేర్కొన్నారు. కోర్టులు పలుమార్లు బెయిల్ మంజూరు చేస్తున్నప్పటికీ, అదే వ్యక్తిపై వరుసగా కేసులు నమోదు చేసి, ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తూ అరెస్టు చేయడం చట్టబద్ధ పాలనకు విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ధోరణి పెరిగిందని, రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రమాదకరమని తెలిపారు. మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని, అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులు, యూట్యూబర్లు, సామాజిక కార్యకర్తలపై మాత్రం కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్