mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

1 గంట క్రితం

Road-accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 12:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • లారీని ఢీ కొన్న ఆటో పెళ్లికి వెళ్లొస్తుండగా దారుణం

ప్రజాశక్తి - చంద్రగిరి : బంధువుల పెళ్లికి ఆటోలో వెళ్లి వస్తుండగా లారీ ఢీకొని నలుగురు మరణించారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... తిరుపతిలో జరుగుతున్న తమ బంధువుల పెళ్లికి బుధవారం మధ్యాహ్నం యాదమరి మండలం పెరుమాళ్లపల్లి నుంచి 11 మంది ఆటోలో బయల్దేరారు. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారి పాకాల మండలం గాదంకి ఫారెస్టు చెక్ పోస్టు సమీపంలో బెంగుళూరు నుంచి శ్రీకాళహస్తికి వెళ్తున్న లారీ సడన్‌‌గా బ్రేక్‌ ‌వేయడంతో వెనుక వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ఏనుగుంటపల్లె గ్రామానికి చెందిన యనమల మాధవి (40), ఆమె కుమార్తె మేఘన (15) అక్కడికక్కడే మృతి చెందారు._ తీవ్రంగా గాయపడి చికిత్స కోసం అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా పి రాజశేఖర్ (25) మృతి చెందాడు. ఇతను చిత్తూరు జిల్లా యాదమరి మండలం పెరుమాళ్లపల్లి వాసి. చికిత్స పొందుతూ పి.బేబి (50) మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన పి.నవీన్, కె.విష్ణు , సూరి, పి. చిన్నబ్బ, పి.రఘు, చాముండేశ్వరి , పి.సుబ్రమణ్యంను తిరుపతి రుయాకు తరలించారు. లారీ డ్రైవర్ షేక్ బాజీ బాబ తీవ్రంగా గాయపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్