అమరావతి : గత వారం రోజులుగా ఎపి లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు సంస్థ సంచలన రిపోర్టును అందజేసింది. సాయికృష్ణ ను లాకప్‌డెత్ చేశారని సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను నమోదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెషన్‌కు గురైన కృష్ణలంక సిఐ నాగరాజును సిట్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేసి విచారించారు. సాయికృష్ణ మృతదేహాన్ని స్టేషన్‌లో తాను చూశానని స్టేషన్ ఎస్సై ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. పోలీసు కస్టడీలోనే చనిపోయాడనే దానికి ఆధారాలు ఉన్నాయని సిట్ స్పష్టం చేసింది. స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా మాయం చేశారని, మృతుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టింది. సాయికృష్ణ చనిపోయాడని తెలిసినా కృష్ణలంక పిఎస్ సిబ్బంది మెజీస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వలేదని, సాక్ష్యాలు మాయం కావడానికి సిఐ నాగరాజే కారణమని ఆరోపించింది. కాగా సిఐ నాగరాజుకు విజయవాడ కోర్టు జూలై 8 వ తేదీవరకు రిమాండ్ విధించింది.
విచారణాధికారి కోర్టుకు సమర్పించిన రిపోర్టులో గాదె విజయలక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం...ఆమె కుమారుడు సాయి కృష్ణ (25సంవత్సరాలు)పై కృష్ణలంక,మాచవరం పోలీస్ స్టేషన్ల కేసులకు సంబంధించి నాన్-బైలబుల్ వారెంట్లు (NBW)పెండింగ్‌లో ఉన్నందున,కృష్ణలంక పోలీసులు అతన్ని 2026మే మొదటి వారంలో మార్కాపురం నుండి తీసుకువచ్చారు.ఫిర్యాదుదారు తన కుమారుడి గురించి విచారించడానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు,అతని కస్టడీకి సంబంధించి ఎటువంటి సంతృప్తికరమైన సమాచారం ఇవ్వలేదు.ఆ తర్వాత ఆమె తన సోదరి,న్యాయవాది కనకదుర్గ ద్వారా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు..పోలీస్ స్టేషన్‌లో ముద్దాయి (ఇన్‌స్పెక్టర్ నాగరాజు)చేసిన దాడి కారణంగా సాయి కృష్ణ మరణించగా,ముద్దాయి ఆ శవాన్ని తగలబెట్టి దాచిపెట్టి,సాక్ష్యాలను మాయం చేశారు.
సమాచారకర్త నివేదిక ఆధారంగా,కృష్ణలంక PSస్టేషన్ హౌస్ ఆఫీసర్ పై భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లు 127(4), 127(6), 103(1), 238కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి,కోర్టుకు,సంబంధిత అధికారులకు సమర్పించారు.
విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం,మహిళా పిఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP)దర్యాప్తును ప్రారంభించి,సాక్షులు 16మందిని విచారించారు.మధ్యవర్తుల సమక్షంలో ఎపిఎఫ్ఎస్ఎల్ బృందం సహాయంతో సిసి కెమెరాల రికార్డర్లను (DVRs),మృతుడిపై కోర్టులు జారీ చేసిన రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లను,ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు..పరిస్థితి ఇలా ఉండగా,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఎం.రవిప్రకాష్ నేతృత్వంలో ఇతర అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT)ఏర్పాటు చేసింది..ఈ సిట్ అధిపతి,బాపట్ల అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (అడ్మిన్)ఎల్.సుధాకర్‌ను ఈ కేసు విచారణాధికారిగా నియమించారు.
సిట్ అధిపతి ఆదేశాల ప్రకారం,నేను (సుధాకర్)దర్యాప్తును స్వీకరించి,మహిళా పిఎస్ ఎసిపి నుండి కేస్ డైరీని తీసుకుని తదుపరి దర్యాప్తును చేపట్టాను.దర్యాప్తులో భాగంగా,నేను 17మంది సాక్షులను విచారించాను.
(మృతుడి తల్లి):ఈమె ప్రథమ సమాచార నివేదికలోని విషయాలను పునరుద్ఘాటించారు..కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో తన కుమారుడిని చూశానని,అతని అరుపులు విన్నానని స్పష్టంగా పేర్కొన్నారు. 2026మే నెలలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ముద్దాయిని తన కుమారుడిని వదిలిపెట్టమని వేడుకోగా,ముద్దాయి ఆమెను చంపేస్తానని బెదిరించాడు.స్టేషన్‌లో కాళ్లు కట్టేసి స్పృహలేని స్థితిలో ఉన్న తన కుమారుడిని ఆమె చూశారు.ముద్దాయి తన కుమారుడిని స్టేషన్‌లో క్రూరంగా కొట్టినట్లు ఆమెకు తెలిసింది.
రిపోర్టులోని తదుపరి పేజీల ముఖ్య సారాంశ పాయింట్లు):
సాక్ష్యలు 11 (మహిళా కానిస్టేబుల్ తులం హిమజ)సాక్షి 12 (హెడ్ కానిస్టేబుల్ లోయా నాగరాజు)మృతుడిని,అతని సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, 06-05-2026న అప్పటి ఇన్‌స్పెక్టర్ (ముద్దాయి)స్టేషన్‌కు రాగానే అతనికి అప్పగించారు.
సాక్షి 15 (సైంటిఫిక్ అసిస్టెంట్, APFSLమంగళగిరి) :జూన్ 19న కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించగా,పోలీసులు కోరిన మే 1నుండి జూన్ 1మధ్య కాలానికి సంబంధించిన ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ డేటా లభ్యం కాలేదు.సాక్ష్యాలను నాశనం చేయడానికి డేటాను తొలగించినట్లు నిర్ధారణ అయింది.
సాక్షి 17 (సబ్ ఇన్‌స్పెక్టర్,కృష్ణలంక PS):తాను ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ప్యాకెట్ తీసుకోవడానికి స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, 06.05.2026, 08.05.2026మధ్య ఒక రోజు మృతుడు స్టేషన్ కస్టడీలో ఉండటం చూశానని సాక్ష్యం ఇచ్చారు..
దర్యాప్తులో తేలిన ముఖ్యమైన అంశాలు -ముగింపు
1.ముద్దాయి 13-08-2024నుండి 14-06-2026వరకు కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు.
2.మృతుడిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత చట్టప్రకారం 24గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సి ఉండగా,ముద్దాయి అలా చేయలేదు.
3.హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ (W.P.No.15132 of 2026)కు సమాధానంగా ముద్దాయి తప్పుడు సమాచారం ఇస్తూ,మృతుడి జాడ కోసం వెతుకుతున్నామని కోర్టును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు.
4.కస్టడీలో ఉన్న వ్యక్తి తీవ్ర గాయాలపాలై మరణించగా,సాక్ష్యాలను దాచడానికి శవాన్ని కాల్చివేసి,నిగూఢంగా పారేసినట్లు ప్రాథమిక ఆధారాలు చూపిస్తున్నాయి.
5.ముద్దాయి విచారణకు సహకరించడం లేదు.శవాన్ని ఎక్కడ పారేశారు,ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాలను రాబట్టడానికి,సాక్షులను బెదిరించకుండా ఉండడానికి ముద్దాయికి జుడీషియల్ రిమాండ్ అవసరం.
ముద్దాయి ఎస్.ఎస్.వి.వి.నాగరాజును జూన్ 24వ తేదీన విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యుడి వద్ద హాజరుపరచగా,అతనిపై ఎలాంటి గాయాలు లేవని,అతను ఆరోగ్యంగా ఉన్నాడని ధృవీకరించారు.కావున,ముద్దాయిని 15రోజుల పాటు జుడీషియల్ కస్టడీకి (రిమాండ్)పంపవలసిందిగా కోర్టును కోరుతున్నట్లు విచారణ అధికారి కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.









కామెంట్‌లు (0)