ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కమ్ముకొచ్చిన మేఘాలు - కనికరం చూపని వరుణుడు

24 జూన్, 2026

Gathering clouds – a merciless Rain God.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 05:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మన్యం : మండలంలోని గత రెండు రోజులుగా వాతావరణ చల్లబడినప్పటికీ బుధవారం వేసవిని తలపించే ఎండ కాసింది. దీంతో విత్తనాలు నాటేందుకు రైతన్నలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కసారిగా సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పు చోటుచేసుకుని చుట్టూ కారు మబ్బులతో కమ్మేసినప్పటికీ రైతులపై వరుణుడు కనికరం చూపని పరిస్థితి ఏర్పడింది. ఉరుములు, మెరుపులతో వచ్చినప్పటికీ కనీసం ఒక్క చుక్క కూడా వర్షం పడకపోవడంతో కొమరాడ మండలంలో రైతులు కమ్మేసిన మేఘాలను చూసి ఆనందపడే లోపు మేఘాలు తేలిపోతున్నాయి తప్ప చినుకు కూడా పడని పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూసినప్పటికీ వరుణుడు కరుణించకపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ మిగిల్చింది. కొమరాడ మండలం అర్తం గ్రామ సమీపంలో పూర్తిగా వాతావరణం కమ్మేసిన మబ్బు పలువురిని ఆకట్టుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్