మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బిజెపి ఎంపి రాఘవచద్దాకు తాత్కాలిక రక్ష‍ణ తిరస్కరణ

01 జులై, 2026

interim protection to Raghav Chadha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 12:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: ఆప్‌ నుండి బిజెపిలో చేరిన ఎంపి రాఘవ్‌చద్దాకు తాత్కాలిక రక్షణ కల్పించాలన్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ దశలో ఈ కేసులో వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు కనిపించడం లేదని జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్‌ పేర్కొన్నారు. అయితే ప్రాథమికంగా పరువునష్టం కలిగించేలా ఉన్నట్లు భావించిన ఐదు సోషల్‌ మీడియా పోస్టులను తొలగించాలని ఆదేశించారు. రాజ్యసభలో డిప్యూటీ నేత పదవి నుంచి ఆప్‌ తనను తొలగించిన అనంతరం తాను బిజెపిలో చేరానని, తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎఐ సాయంతో రూపొందించిన కంటెంట్‌, డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్‌ వీడియోలను పథకం ప్రకారం సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని రాఘవ్‌ చద్దా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించాలని ఆయన కోర్టును కోరారు. అయితే రాజకీయ నాయకుడిగా ఆయన నిర్ణయాలపై వ్యక్తమైన విమర్శలకు సంబంధించిన వివాదంగానే ఇది కనిపిస్తోందని, ఆయన గుర్తింపును అనధికారికంగా వాణిజ్యపరంగా వినియోగించుకున్న అంశం కాదని గత విచారణ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘వ్యక్తిత్వ హక్కుల’ ఉల్లంఘనపై దాఖలైన వ్యాజ్యాన్ని స్వీకరించడంపై కోర్టు సందేహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్