కోల్‌కతా : తనపై రెండు రోజుల్లో వరుసగా రెండు సార్లు బిజెపి గూండాలు దాడి చేసినట్లు మమతా బెనర్జీ వర్గానికి చెందిన టిఎంసి ఎమ్మెల్యే కునాల్ ఘోష్ ఆదివారం తెలిపారు. తూర్పు కోల్‌కతాలోని తన నియోజకవర్గం బెలియాఘాటాలో ఒక కార్యక్రమానికి వెళుతుండగా తన కారుపై దాడి జరిగిందని అన్నారు. నార్కెల్‌దంగా ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగులు సుత్తులతో తన కారు అద్దాన్ని ధ్వంసం చేశారని, అదే సమయంలో వారిలో ఒకరు తన భద్రతా సిబ్బందిపై తుపాకీ గురిపెట్టారని అన్నారు. మమతా బెనర్జీ సమావేశానికి హాజరయ్యేందుకు హుగ్లీ జిల్లాలో వెళ్తుండగా శనివారం కూడా ఘోష్ కారుపై రాళ్లు, గుడ్లు విసిరినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. శనివారం ఉత్తరపారాలో తనపై దాడి జరిగిందని, ఆదివారం కూడా తనను చంపాలని యత్నించారని ఘోష్ మీడియాకు తెలిపారు. కారు ముందు అద్దాన్ని ధ్వంసం చేశారని అన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని అన్నారు. బిజెపి పాలనలో పశ్చిమ బెంగాల్‌లో ‘అరాచకపాలన’ నడుస్తోందని ఘోష్ విమర్శించారు. అధికార పార్టీకి చెందిన గుండాలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎమ్మెల్యేపై కూడా దాడులకు పాల్పడుతున్నా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కునాల్‌ఘోష్ ఆరోపించారు.
నాపై రెండు సార్లు బిజెపి గూండాల దాడి : కునాల్ ఘోష్
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 05:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)