ముంబయి : టాటా స్టీల్ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో రూ.3,666.41 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 18.2 శాతం పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం 11.5 శాతం వృద్ధితో రూ.65,436.24 కోట్లకు చేరింది. బ్రిటన్ వ్యాపారంలో మందగమనం వల్ల ప్రతికూలతలు ఎదురైనా, భారత వ్యాపారం మెరుగైన పనితీరు కనబరిచింది. దేశీయ విభాగం ఆదాయం 22.6 శాతం పెరిగి రూ.42,653 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో మూలధన వ్యయాల కింద రూ.3,280 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ తెలిపింది. పాలనా మార్గదర్శకాల ప్రకారం 2026 నవంబర్ 11 నుంచి నోయెల్ నావల్ టాటా బోర్డు నుంచి వైదొలగనున్నారు. ప్రతికూల అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ముడిసరుకుల వ్యయాల ఒత్తిడి ఉన్నప్పటికీ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ భారత మార్కెట్‌లో వృద్ధి సాధించామని టాటా స్టీల్ సిఇఒ, ఎండి టివి నరేంద్రన్ తెలిపారు.
టాటా స్టీల్‌కు రూ.3,666 కోట్ల నికర లాభాలు
17 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026, 10:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)