mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎవరి గొప్ప వారిదే!

1 గంట క్రితం

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 04:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎవరి గొప్ప వారిదే!

పొదలలోన నివసించే

తల్లి పంది, పిల్ల పంది

అడవంతా చూచుటకై

కలసిమెలసి బయలుదేరె!


కొంతదూరం వెళ్ళ గానె

ఊగుచున్న చెట్టు గాంచె

అచ్చెరువుతో అటుపోయి

చెట్టుపైకి చూసినవవి!


చిగురు కొమ్మ ఊపుతున్న

కోతి ఒకటి కనిపించెను

'ఎంత తెగువ ఆ కోతికి?'

తల్లి నడిగె పిల్ల పంది!


'అలవాటుగ చేయు పనిలో

నైపుణ్యత ఉండునులే,

అటుల చేసి కోతి ఊపె'

బదులు పలికె తల్లి పంది!


అటు పోయె దారిలోన

అందమైన జింక ఒకటి

పెద్ద పెద్ద గంతులతో

వాటి ముందు పరుగు పెట్టె!

'చక్కనైన జింకపిల్ల

ఆదమరచె పరుగులోన,

అదుపు తప్పి పడిపోదా?'

తల్లి నడిగె పిల్ల పంది!


'పుట్టుకతో వచ్చె విద్య,

సాధనతో మెరుగుపడును,

ఏకాగ్రతే దాని పట్టు'

బదులు పలికె తల్లి పంది!


'కోతి, జింక గొప్పతనం

మచ్చుకైన నాకు లేదు,

నేర్చుకొనే దారిలేదు'

దిగులు పడి చెప్పె పిల్ల!


'వాడి అయిన మన మూతికి

నేల తవ్వె శక్తి గలదు,

భూమిలోని దుంపలను

ఈ విధంగ తియ్యగలం!'


'మనము చేయు ఈ పనితో

గుంతలెన్నొ ఏర్పడును,

గుంత పడిన చినుకులన్ని

భూమిలోన చేరుకొనును!'


'అడవి చెరువు జలకళకు

మన ఉనికే కొలమానం,

ఎవరి గొప్ప వారిదిలే,

తెలుసుకొనుము చిట్టి పిల్ల!'


'పుట్టుకతో పొందు గుణం,

సాధనతో పెరుగు బలం,

ఆచరించు ముద్దు కూన'

సర్ది చెప్పె తల్లి పంది!


తల్లి అనిన మాటలు విని

పిల్ల పంది సంతసించె

ఉల్లసంగ అడవినంతా

తల్లితోడ తిరిగి నంత!


- బి.వి. పట్నాయక్,

83098 72913.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్