అనగనగా ఒక ఊరిలో కుందేలు ఉండేది. ఒక రోజు కుందేలు గాలిపటం కొనుక్కోవడానికి సంతకు వెళ్ళింది. అక్కడ కుందేలుకి ఒక రంగు రంగుల గాలిపటం నచ్చి, కొనుక్కుంది. తర్వాత రోజు, కుందేలు గాలిపటం తీసుకొని తన ఇంటిపైకి వెళ్లి ఎగరేసుకుంది. కొద్దిసేపు తర్వాత, గాలిపటానికి ఉన్న దారం తెగిపోయి, ఒక చెట్టులో ఇరుక్కుంది. ఆ తరువాత ఒక కాకి దాని బలమైన ముక్కుతో చెట్టులో ఇరుక్కుపోయిన గాలిపటాన్ని తీసి, ఆ కుందేలుకి ఇచ్చింది. అప్పుడు ఆ కుందేలు సంతోషించింది. ఆ రోజు నుండి అవి మంచి స్నేహితులు అయ్యాయి. ఒకరికొకరు సహాయం చేసుకోవడంలోనే ఆనందం ఉందని తెలుసుకున్నాయి.


_షేక్ ఆసిఫ్, 5వ తరగతి,
ది క్రాస్‌వర్డ్ స్కూల్, గుంటూరు.








కామెంట్‌లు (0)