మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

AP 10th Class: టెన్త్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదల

19 జూన్, 2026

ap 10th supplimentary results
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 10:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి సప్లమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ‌శుక్రవారం ఎక్స్‌ ‌ద్వారా ఈ ఫలితాలను విడుదల చేశారు. మే 25 నుంచి జూన్‌ 5వ తేది వరకు జరిగిన ఈ పరీక్షలకు 94,990 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో 78,261(82.39)శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 37,179 మంది హాజరవ్వగా వీరిలో 31,749(85.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా 57,811 మంది హాజరైన బాలురలో 46,512(80.46శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు కంటే బాలికలు 4.93శాతం అధిక ఉత్తీర్ణత సాధించారు. ప్రకాశం జిల్లా 97.96శాతంతో తొలిస్థానంలో నిలవగా 63.18శాతంతో ఎన్టీఆర్‌ ‌జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ నెల 20వ తేది ఉదయం 10 గంటల నుంచి 26వ తేది రాత్రి 11 గంటల వరకు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ‌కోసం అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ‌కెవి శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్‌ ‌కోస రూ.500లు, రీ వెరిఫికేషన్‌ ‌కోసం రూ.1000లు చెల్లించాలని తెలిపారు.



ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి ...

మొదట అధికారిక వెబ్‌సైట్ https://results.bse.ap.gov.in/ ను సందర్శించాలి.

హోమ్ పేజీలో కనిపించే 'AP SSC Advanced Supplementary Results' లింక్‌పై క్లిక్ చేయాలి.

మీ పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్ నంబర్‌ను అక్కడ నమోదు చేయాలి.

సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే మీ మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

భవిష్యత్తు అవసరాల కోసం ఆ మార్కుల జాబితాను ప్రింట్ అవుట్ లేదా పిడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవడం మంచిది.


వాట్సాప్ లో ఎపి టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు ....

మీ మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేయండి.

వాట్సాప్‌లో ఈ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.

మెనూలో 'Education Services' ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఆ తర్వాత 'డౌన్లోడ్ SSC సప్లిమెంటరీ ఫలితాలు' అనే లింక్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నంబర్ ఇస్తే చాలు. మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్