mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మద్యపానం హానికరం

4 రోజుల క్రితం

family
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనగనగా రంగాపూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రంగయ్య, రమణమ్మ అనే దంపతులు ఉన్నారు. వాళ్లకు ఇద్దరు కూతుర్లు. రంగయ్య బాగా తాగి వచ్చి రమణమ్మను కొట్టేవాడు. ఒకరోజు రమణమ్మ రంగయ్యతో ‘ఎందుకయ్యా బాగా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటావు’ అని అన్నది. అయినా రంగయ్య వినకుండా మళ్ళీ తాగి వచ్చాడు. ఒకరోజు వాళ్ళ కుమార్తెలు కలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి ‘నాన్నా నువ్వు ఇలా తాగితే నీ ఆరోగ్యం ఏం కావాలి. మీ ఆరోగ్యం ఏమైనా అయితే మా భవిష్యత్తు ఏం కావాలి’ అని ప్రశ్నించారు. అప్పుడు రంగయ్య వాళ్ళ మాటలు విని బాధపడ్డాడు. ఆ రోజు నుంచి రంగయ్య మందు తాగడం మానేశాడు. కుటుంబం కోసం కష్టపడడం మొదలుపెట్టాడు. పిల్లలిద్దరూ బాగా చదువుకుంటున్నారు. రంగయ్యలో వచ్చిన మార్పు చూసి రమణమ్మ, పిల్లలు కలిసి ఊరూరు తిరిగి ‘‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం!’’ అని ప్రచారం చేశారు. ఫలితంగా చుట్టుపక్కల ఊళ్లల్లో అందరూ మందు తాగడం మానేశారు. మద్యపాన నిషేధం వల్ల గ్రామాల్లోని కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిసాయి.
​నీతి : మద్యపానం హానికరం

కుమ్మరి రిషిక
7వ తరగతి, జడ్పీ స్కూల్ రాంపూర్,
మండలం నిజాంపేట, మెదక్ జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్