mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నా చేతుల్లో ప్రపంచం

4 రోజుల క్రితం

dreem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నేను నిద్రలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే అందమైన కల వచ్చింది. కలలో.. నిద్రలోకి జారుతున్న సమయాన, అలా అలా చినుకులు భూమిపై పాడుతున్నప్పుడు, సూర్యుని కిరణాలు భూమిపై ప్రసరించినప్పుడు, హరివిల్లులో సప్త రంగులు ప్రకాశిస్తున్నప్పుడు, ఆ గాల్లో, ఆ మేఘాల్లో తిరుగుతున్న నేను.. ఆహా ఎంత ఆహ్లాదకరమైన దృశ్యం..
ఎక్కడ చూసినా రంగురంగుల సీతాకోకచిలుకలు వద్దన్నా కనిపిస్తున్న రకరకాల పక్షులు. ఆ ప్రపంచం, ఆ ప్రపంచానికి మహారాణిని నేను!._ఎప్పటికీ అక్కడ ఉండిపోవాలి అనేంతగా ఉంది నా చుట్టూ ఉన్న ప్రపంచం. ఆకాశం నుండి దిగాక నా మనసును తాకిన అనుభూతి గలగల పారే సెలయేరు శబ్దాలు, ఆకాశాన్ని తాకుతున్న కొండలు, ఇవన్నీ వదిలి, నా మనస్సు ఉండగలదా? ప్రపంచమంతా నా చేతుల్లో, నా కళ్ళలోనే ఉన్నట్టు ఆనందంతో నిండిపోయింది. ఆ ప్రపంచాన్ని ఎక్కడికీ పోనివ్వకుండా పట్టుకుంది నా మనసు. ఆ ప్రపంచం నా హృదయం.

 హెవనికా తెంటు 7‌వ తరగతి,
ది క్రాస్‌వర్డ్ స్కూలు, గుంటూరు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్