ఒకప్పుడు ఒక రాజ్యంలో రాజు వీరేంద్రుడు ఉండేవాడు. అతను ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు తనపట్ల గౌరవం ప్రజల్లో ఎంత ఉందో తెలుసుకోవాలని అనుకున్నాడు. రాజు సాధారణ వ్యక్తి రూపంలో మారువేషం వేసుకుని గ్రామాల్లోకి వెళ్లాడు. ఒకగ్రామంలో వృద్ధుడు రోడ్డుపై భారమైన సంచి మోస్తూ కష్టపడుతుండటాన్ని చూశాడు. వెంటనే రాజు అతనికి సహాయం చేశాడు. అప్పుడు ఆ వృద్ధుడు ‘బాబూ..! నువ్వెవరు? అని అడిగాడు. కానీ రాజు తన గురించి చెప్పలేదు.
మరుసటి రోజు రాజదర్బారులోకి ఆ వృద్ధుడిని పిలిపించారు. అక్కడ రాజును చూసి ఆశ్చర్యపోయిన వృద్ధుడు వెంటనే రాజుకు నమస్కరించి ‘మహారాజా..! మీమీద నాకు గౌరవం మీ సింహాసనం వల్ల కాదు.. మీరు చేసిన సహాయం వల్ల వచ్చింది` అన్నాడు.
నీతి : గౌరవం పదవి వల్ల కాదు మంచి మనసు వల్ల వస్తుంది.
ఎ.హేమాక్షి మన్విత,
పెనుగొండ.








కామెంట్‌లు (0)