శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన

19 నిమిషాల క్రితం

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 06:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అల్లూరి : ​అల్లూరి సీతారామరాజు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టర్ టి.నిశాంతి పాడేరు మండలంలోని చింతలవీధి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చేపడుతున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి పి.ఎస్. కుమార్, పాడేరు తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్