శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ధైర్య’లక్ష్మికి సిపిఎం పరామర్శ

9 గంటల క్రితం

‘ధైర్య’లక్ష్మికి సిపిఎం పరామర్శ 
- ఆసుపత్రికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్న వి.శ్రీనివాసరావు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆసుపత్రికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్న వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - అనంతపురం : పేరులోనే కాకుండా, స్నేహితురాలిని కాపాడేందుకు తెగువ చూపి నిజంగానే ‘ధైర్యలక్ష్మి’ అని కూడా నిరూపించుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రశంసించారు. అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థినిపై హేమంత్ అనే ఉన్మాది దాడి చేస్తున్న సమయంలో స్నేహితురాలు లక్ష్మి అడ్డుపడిన క్రమంలో ఆ ఉన్మాది లక్ష్మిపైనా దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడి అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని వి. శ్రీనివాసరావు శుక్రవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతోనూ శ్రీనివాసరావు మాట్లాడుతూ... లక్ష్మి కోలుకుంటోందన్నారు. వైద్యం అందించడంలో కృషి చేసిన వైద్యులను అభినందించారు. సమాజంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. దాడికి పాల్పడిన యువకుడిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగేంద్రకుమార్‌, జిల్లా నాయకులు ఆర్‌‌వి.నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్