బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్సై సాగర్‌

25 నిమిషాల క్రితం

nomination.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 11:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు ప్రారంభం

ప్రజాశక్తి – నార్పల : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నార్పల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యాలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నామినేషన్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని, ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతుందని రిటర్నింగ్‌ అధికారి భారతి, సహాయ రిటర్నింగ్‌ అధికారి మమతాదేవి తెలిపారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, స్థానిక పోలీస్‌ స్టేషన్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు వచ్చే అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నామినేషన్‌ పత్రాల నింపడంలో సందేహాలు ఉన్న అభ్యర్థుల కోసం ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. అభ్యర్థులు హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సాగర్‌ హెచ్చరించారు. కార్యాలయం పరిసరాల్లో జరిగే ప్రతి ఘటనను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా అందరూ సహకరించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్