ప్రజాశక్తి మంగళగిరి
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్- 2026కు ప్రభుత్వం వివిధ కేటగిరీలలో ప్రకటించిన అవార్డులకు గుంటూరు జిల్లా మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరా నగర్ యూపీహెచ్సీకి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ హాస్పిటల్ గా ఎంపికయింది. ప్రభుత్వం గురువారం ప్రకటించిన జిల్లా, రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ -2026, అవార్డుల జాబితాలో యూపీహెచ్సీలలో ఇందిరానగర్ యూపీహెచ్సీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ హాస్పిటల్ గా ప్రథమ స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష మాట్లాడారు. హెల్త్ సెంటర్ రాష్ట్రంలోని యూపీహెచ్సీలలో ఉత్తమ స్వచ్ఛ హాస్పటల్ గా ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, పూర్వ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం పద్మావతి, డీపీఎమ్ఓ డాక్టర్ సుజాత జిల్లా, రాష్ట్ర వైద్యాధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా హెల్త్ సెంటర్ మరింత పరిశుభ్రంగా ఉండటానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.








కామెంట్‌లు (0)