నాడు డోర్ డెలివరీ నేడు బాడీ అదృశ్యం
...ఈ రెండేళ్లలో ఏమి సాధించారని విజయోత్సవ సభలు
...బీచ్ లో బార్లు పెట్టి కుటుంబ ఆహ్లాదకరాన్ని పాడు చేయకండి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు
ప్రజాశక్తి-కాకినాడ : గత రెండేళ్లగా మన రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి వర్ణాతీతంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు స్పష్టం చేశారు. శుక్రవారం సిపిఐ కాకినాడ జిల్లా సమితి సమావేశాలు సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర లేక సిండికేట్ మార్కెట్ మాయాజాలంతో రైతులు విల విల లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు అప్పులు చేసి అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మధు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఏ ఒక్క కౌలు రైతుకు ఏ ఒక్క బ్యాంకు వ్యవసాయ ఉద్యాన పథకాలు ఇవ్వడం లేదని మధు విమర్శించారు. గత ఎన్నికల ముందు డాక్టర్ ఎమ్మెస్ స్వామి నాథన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు అమలకు నోచుకోలేదని ఆయన మోడీపై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా మన రాష్ట్రములో రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసి ఆత్మ హత్యల నుంచి రైతాంగాన్ని కాపాడాలని మధు కోరారు. యుద్ధం నేపథ్యంలో ఇటీవల పెరిగిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్, వ్యవసాయ యంత్ర పరికరాలు ధరలు వెంటనే తగ్గించాలని మధు డిమాండ్ చేశారు. ఆక్వా రైతులకు రొయ్యల ఫీడ్ సీడ్ మెడిసిన్ ధరలను తగ్గించాలని జోన్ నాన్ జోన్ పరిమితులు లేకుండా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రూపాయి 50 పైసలకే అందించాలని రొయ్యలకు మద్దతు ధర ప్రకటించాలని మధు డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కాలవల నిర్మాణం చేపట్టాలని చెరువుల ఆక్రమణ తొలగించి కట్టెలను బయోపితం చేయాలని మధు డిమాండ్ చేశారు. పాలకుల కళ్ళు తెరిపించడానికి మన హక్కులు సాధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం చేస్తున్న చలో విజయవాడ కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మధు ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి జిల్లాలో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని ఈ రెండు ఏళ్లలో ప్రజలకు ఏం చేశారో బహిరంగంగా చెప్పాలని తాటిపాక మధు పేర్కొన్నారు. పెన్షన్, జీతాలు ఇవ్వడం ఇవన్నీ ప్రతి ప్రభుత్వం చేస్తుందని ఈ రెండేళ్లలో చంద్రబాబు నాయుడు ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా ఒక్క ప్రభుత్వ కళాశాల నిర్మించారా ఒక్క ప్రభుత్వ సంస్థలు నిర్మాణం చేశారా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను పరిరక్షించారా ? అని ప్రశ్నించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారా సాగునీటి ప్రాజెక్టులు కట్టారా ? నిరంతరం పనిచేసే కార్మికుల జీతాలు రూపాయి అయినా పెంచారా అని ప్రశ్నించారు. పేదలకు ఇస్తామన్న ఇంటి స్థలాలు ఇచ్చారా ? ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులతో తల్లిదండ్రులని దోచుకుంటుంటే ఎక్కడైనా అరికట్టరా ? నిరోధ్యగ భృతి ఇచ్చారా అని ప్రశ్నించారు. నాడు డోర్ డెలివరీ నేడు సాయి కృష్ణ బాడీ అదృశ్యం అయ్యిందన్నారు. రాష్ట్రం లో అరాచక పాలన సాగుతుందన్నారు. హామీలు అమలు చేయక పొగా మరల బీచ్ లో మద్యం దుకాణాలు తీరుస్తారా సిగ్గుందా మీకు అని మధు దుయ్యబట్టారు. మీరే బార్లు పెడతారు మళ్లీ బయట తాగి రోడ్డు మీద తిరిగితే మళ్లీ మీరే కేసులు పెడతారు తాగమనేది మీరే మరల దగ్గర డబ్బులు దొబ్బేది మీరే ఇది ఎక్కడ అన్యాయం అని మధు ప్రశ్నించారు. ఇవన్నీ సమస్యలపై జిల్లా సమితిలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ముందుకు తీసుకెళ్లి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని ప్రజలకు అండగా ఉంటామని తాటిపాక మధు తెలిపారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, శాఖ రామకృష్ణ, ఏ భవాని, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)