విజయవాడ : గాదె సాయికృష్ణ నివాసంలో ఎసిపి బృందం విచారణ ముగిసింది. సాయికృష్ణ తల్లి, బంధువుల స్టేట్‌మెంట్ ను ఎసిపి దైవప్రసాద్ బృందం రికార్డు చేశారు. దాదాపు గంటన్నరపాటు విచారణ కొనసాగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు ముగ్గురు సభ్యుల ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆధారాలను బృందం సేకరిస్తుంది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సిఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో .. బిఎన్‌ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1)తో పాటు బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 238 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
గాదె సాయికృష్ణ నివాసంలో ముగిసిన ఎసిపి విచారణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 02:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)