mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

2002 ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలి : ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు వి.శ్రీనివాసరావు లేఖ

1 గంట క్రితం

v.srinivasarao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో 2002 ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరుతూ ... ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కి, సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జూన్ 15 నుండి ప్రారంభమైందని, రాజకీయ పార్టీలు కూడా బూత్‌లెవెల్ ఏజెంట్లను నియమిస్తున్నాయని అన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేశారని, ఆ లిస్టుల్ని రాజకీయ పార్టీలకు అందించినట్లయితే బిఎల్ఏ ల పని మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. బూత్ స్థాయి కాపీలను రాజకీయ పార్టీలకు అందించాలని కోరారు. ఎస్ఐఆర్‌పై మే 26వ తేదీన రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరిపినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు 2002 నాటి జాబితా ఇవ్వాలని మిమ్ములను (ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) కోరాయని గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదిస్తామని మీరు (ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) చెప్పారు... కానీ ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమై 4 రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఆ జాబితా రాజకీయ పార్టీలకు అందలేదు అని వివరించారు. కాబట్టి మీరు (ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) 2002 నాటి ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు అందజేయడానికి చర్యలు తీసుకోవాలని వి.శ్రీనివాసరావు కోరారు.

cpim letter



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్