ప్రజాశక్తి-యలమంచిలి టౌన్ (అనకాపల్లి) : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు తృటిలో పెను ప్రమాదం తప్పిన ఘటన గురువారం రాత్రి రేగుపాలెంలో జరిగింది. నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామంలో జాతీయ రహదారి 16 పై వెళుతున్న శ్రీ తులసి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యి బస్సును ఆపేసి ప్రయాణీకులందరినీ అత్యవసర ద్వారం నుండి కిందికి దించేశారు. యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర తెలిపిన సమాచారం ప్రకారం .... చెన్నై నుంచి 35 ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో శ్రీ తులసి ట్రావెల్స్ ఒడి 18 ఎం 3336 బస్సు భువనేశ్వర్ వెళుతుంది. రేగుపాలెం దగ్గరికి వచ్చేసరికి ఇంజెన్లో మంటలు చెలరేగినట్టు బస్సు ఫైర్ అలారం రావడంతో బస్సు డ్రైవర్ బస్సు నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా దింపేశారు. సమాచారం అందుకున్న స్థానిక హైవే పెట్రోల్ వాహనం తక్షణమే అక్కడకి చేరుకొని ప్రయాణీకులకు సహాయం అందించారు. అగ్నిమాపక వాహనం అక్కడకి వచ్చి 10 నిముషాలలో మంటలను అదుపు చేసింది. వెంటనే క్రేన్ సహాయంతో ఆ బస్సును ఖాళీ స్థలంలోకి మార్చి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశారు. అనంతరం శ్రీ తులసి ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణీకులను వేరే బస్సు ఏర్పాటు చేసి గమ్యాస్థానాలకి పంపారు. యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని, గాయాలు కాలేదని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తృటిలో తప్పిన పెనుప్రమాదం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 03:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)